…..ప్రజాస్వామ్య పద్ధతిలో తలపడే దమ్ము లేదా…?

—నామినేషన్ తిరస్కరణకు విశ్వప్రయత్నం.

 …..ఓటమిభయంతో నకిలీ పత్రాలు సృష్టించారు.

…..ప్రజాస్వామ్యం గెలిచింది.

.…….అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించారు.

…….కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి  విజయ రమణారావు.

అగ్నిధారన్యూస్, పెద్దపల్లి:

ఎన్నికలలో ప్రజాస్వామ్య పద్ధతిలో కాకుండా అప్రజాస్వామిక పద్ధతిలో గెలువాలని దురుద్దేశంతో,అధికార దుచర్యకు పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి పాల్పడుతూ, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయ రమణారావు ఆరోపించారు.సోమవారం  అభ్యర్థుల నామినేషన్ స్క్రూటీన్ లో భాగంగా పెద్దపల్లి ఆర్డీవో ఆఫీస్ లో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రజాస్వామ్య దేశంలో,ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల్లో పోటీ పడాల్సిన విధానాలు మానీ, అడ్డదారుల్లో  గెలుపొందాలనే,దురుద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ అభ్యర్థి చింతకుంట విజయరమణరావు ఆర్డీవో కార్యాలయ సమీపంలో విలేకరులతో మాట్లాడుతూ.. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాటినుండి దాసరి మనోహర్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందన్నారు. పతనం  ప్రారంభమైందన్నారు. నా నామినేషన్ ను రిజెక్ట్ చేయడం కొరకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. లేనటువంటి బెంజి కారు ఉన్నట్లు, విదేశాల నుండి లావేదేవీలు జరిగినట్టు, ఫేక్ అకౌంట్లను సృష్టించి, ఫోటో ను మార్పింగ్ చేశారన్నారు. నీతిమాలిన చర్యలతో  నా అభ్యర్థిత్వాన్ని తిరస్కరించేటువంటి భారీ కుట్ర జరిగింది అన్నారు. దాసరి సూచనల మేరకే ఇలాంటి దృశ్చర్యకు పాల్పడ్డట్టు తెలిసింది అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో తనపైన జరుగుతున్న కుట్రాలను ప్రజలు గ్రహిస్తున్నారన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఎవరిని కుట్రలు చేసినా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందన్నారు. ఏది ఏమైనా పెద్దపల్లి ఆర్ఓ రిటర్నింగ్ అధికారి క్షుణ్ణంగా పరిశీలించి, నా అభ్యర్థత్వాన్ని ఆమోదించినట్లు తెలిపారు.ఆర్డీవో ఆఫీస్,మజీద్ చౌరస్తా, ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ మొత్తంలో తరలిరావడంతో ఆ ప్రాంతంలో ఒకింత ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. ఎలాంటి  అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో భారీగా పోలీస్ బందోబస్తు  ఏర్పాటు చేశారు.