ఉదయం 7 గంటలకు ప్రారంభమై ఐదు గంటలకు ముగియనున్న ఎన్నికలు.

సాయంత్రం ఏడు గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభం.

ప్రధాన పోటీ ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య

మార్పు కోరుకుంటున్న సింగరేణి కార్మిక సంఘాలు.

అగ్నిధారన్యూస్ (సింగరేణి ఏరియా బ్యూరో)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 జిల్లాలో  సింగరేణి  వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లో, 84 కేంద్రాలలో,  పోలింగ్.. ( ఈరోజు )బుధవారం  ఉదయం 7 గంటలకు ప్రారంభమైందని ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ ప్రసాద్, టి పి సి సి కార్యదర్శి పెర్క శ్యామ్ అన్నారు. గోదావరిఖని,మందమర్రి, రామకృష్ణాపూర్, ప్రాంతాల్లో జరుగుతున్న ఎన్నికల సరళిని పరిశీలించారు. అదేవిధంగా ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు  కొనసాగుతుందన్నారు. సింగ‌రేణి వ్యాప్తంగా ఉన్న 11 డివిజన్లలో 39, 773 మంది కార్మికులు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు అన్నారు. ఎన్నికల సరళి పరిశీలించినట్లయితే కచ్చితంగా ఐ ఎన్ టి యు సి గెలుపు ఖాయమన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏవిధంగానైతే, సత్తా సాటి అధికారం కైవసం చేసుకుందో.. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐ ఎన్ టి యు సి జెండా సింగరేణి గడ్డపైన ఎగురవేయడం ఖాయమన్నారు. ఎన్నికల ముగిసిన అనంతరం ఇదే రోజు సాయంకాలం ఫలితాలు వెలువడనున్నాయన్నారు. ఐ ఎన్ టి యు సి జండా కార్మికులకు అండగా ఉంటుందన్నారు.