అగ్నిధారన్యూస్(రామగిరి మండలం)
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల రామగిరి పోలీస్ స్టేషన్ నందు రామగిరి మండలం కు చెందిన అన్ని గ్రామాల ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై, రోడ్ సేఫ్టీ లపై రోడ్డు ప్రమాదాలపై అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్ఐ కటికే రవి ప్రసాద్ ఆటో డ్రైవర్లను ఉద్దేశించి ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, వాహనాలకు సంబంధిత పత్రాలను ఉంచుకోవాలని సూచించాలని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని తెలిపారు. ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు చూసినట్లయితే ఎక్కువ మద్యం తాగి వాహనాలు నడుపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని కోరారు. ఎవరైనా తాగి మద్యం నడిపిన, వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలను నడిపిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
