అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: 

పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, రాఘవపురం గ్రామపంచాయతీ కార్యదర్శిపైన చర్యలు తీసుకోవాలని శనివారం రోజు రాఘవపురం గ్రామానికి చెందిన తాడిచెట్టి శ్రీకాంత్ పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రాఘవపురం గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ ఆడపు వెంకటేశం పంచాయతీరాజ్ చట్టం 2018 కి విరుద్ధంగా ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారని శ్రీకాంత్ ఇటీవల ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారుల నివేదికల ఆధారంగా, కోర్టు ఆదేశాలతో, జిల్లా కలెక్టర్, వెంకటేశంను అనర్హుడిగా ఇటీవల ప్రకటించారు…గ్రామపంచాయతీలో జరిగే ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వులు జారీ చేశారని శ్రీకాంత్ తన ఫిర్యాదులో తెలిపారు. అయినప్పటికీ శుక్రవారం రోజు జరిగిన అధికారిక వేడుకైన  గణతంత్ర దినోత్సవoలో రాఘవపురం గ్రామపంచాయితీలో వెంకటేశం ఏహోదాలో జాతీయజెండా ఎగురవేశారో, తెలపాలని పంచాయతీ  కార్యదర్శిని అడిగినప్పటికీ, సరైన సమాధానం లేదని తన ఫిర్యాదులో పేర్కొంటూ, వెంకటేశంతో పాటు పంచాయతీ కార్యదర్శి పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్, వంశీ ఫిర్యాదు చేశారు.