ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్.
అగ్నిధారన్యూస్( రామగుండం పోలీస్ కమిషరేట్ )
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాకు సమీపంలో ఓ ఇంటి నిర్మాణం పనులు చేస్తుండగ గోడ కూలి ముగ్గురు కూలీలు మృతి, మరొకరికి తీవ్రగాయాలాయ్యాయి. ఈ సంఘటన స్థలానికి చేరుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎమ్.శ్రీనివాస్, అక్కడ పరిస్థితిని పరిశీలించి జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో ధర్యాప్తు చేస్తాం అన్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటే ముగ్గురు ప్రాణాలు పొయ్యి ఉండేవి కాదని అభిప్రాయపడ్డారు. కూలీలలోఒకరికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అన్నారు.



