అగ్నిధారన్యూస్, రామగుండంపోలీస్ కమిషనరేట్: గురువారం రోజు రామగుండo పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో సాయంత్రం 5 గంటల సమయంలో వాటర్ ట్యాంక్ ఏరియా మంచిర్యాల కు చెందిన హరిదాస్ సాయికృష్ణ, వ,, 29 సం,, అను వ్యక్తి ఏసీసీ ఏరియా సమీపంలో రైలు పట్టాలపై ఆత్మహత్యయత్నం చేసుకొనుటకు పడుకోనివున్నాడు అను సమాచారం మంచిర్యాల బ్లూకొల్ట్ కానిస్టేబుల్స్ సత్యనారాయణ, రాజకుమార్ లకు డయల్ 100 కాల్ రాగా వెంటనే స్పందించిన బ్లూక్లోట్ కానిస్టేబుల్స్ సంఘటన స్థలానికి వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వ్యక్తిని సకాలంలో కాపాడి, పోలీస్ స్టేషన్ కు తీసుకురాగా మంచిర్యాల టౌన్.ఇన్స్పెక్టర్, బన్సిలాల్ ఆ వ్యక్తికి అతని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ చేసి అతనిని ప్రభుత్వ ఆసుపత్రి నందు డీ-అడిక్షన్ సెంటర్ కు పంపించారు. సకాలంలో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన సదరు బ్లూకొల్ట్ కానిస్టేబుల్స్ లను అభినందించి సిఐ రివార్డ్ అందించారు.

