బెల్టు షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక.

అగ్ని ధార న్యూస్ సుల్తానాబాద్ 

సుల్తానాబాద్ మండలంలోని వివిధ గ్రామాలలో బెల్టు షాపులు నిర్వహిస్తున్న యజమానులతో సుల్తానాబాద్ ఎస్ ఐ  శ్రావణ్ కుమార్ సమావేశం నిర్వహించి బెల్టు షాపు నిర్వాహకులతో పలు సూచనలు తోపాటు హెచ్చరికలు జారీ చేశారు. గ్రామాలలో కిరాణా షాపులు నిర్వహిస్తూ కిరాణా షాపు ముసుగులో అక్రమ మద్యం అమ్ముతున్నారని అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, బెల్టు షాపులు నిర్వహించడం వలన గ్రామాలలోని యువత మద్యానికి బానిసై తమ బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. గ్రామాలలో అక్రమంగా మద్యం అమ్మి శాంతిభద్రలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ ఎస్ ఐ హెచ్చరించారు.