అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
ఆర్.ఎం.పి అండ్ పీఎం పి లపై టి ఎస్ ఎం సి దాడులకు నిరసనగా ఆర్ఎంపి అండ్ పి.ఎం.పి వైద్యులు ఈ నెల 29 నుండి గ్రామాల్లో ఆర్ఎంపీ పీఎంపీ వైద్యుల సేవలు నిలిపివేస్తున్నట్లు ఆర్.ఎం.పి పి.ఎం.పి ల సంఘం జిల్లా అధ్యక్షులు టి శ్రీనివాసమూర్తి పిలుపునిచ్చారు. అలాగే 29 గురువారం ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్ఎంపీలు అండ్ పిఎంపీలు హాజరు కావాలన్నారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసనలు కొనసాగిస్తామని తెలిపారు . గ్రామాల్లో ఏళ్లుగా కొనసాగిస్తున్న వృత్తిని అర్ధాంతంగా మూసివేయడం వలన ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు .దీనికి ప్రజలందరూ సహకరించగలరని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం పి, పి ఎంపి ల జిల్లా గౌరవ అధ్యక్షులు అజీజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి ఎస్ శంకర్, ఆకుల రమేష్ మంచి కట్ల కుమారస్వామి వివిధ మండలాల అధ్యక్షులు , కార్యదర్శులు పాల్గొన్నారు.
