అగ్నిధారన్యూస్ మహమ్మదాబాద్ :

మహమ్మదాబాద్ మండల కేంద్రానికి చెందిన పి. మల్లయ్య మేక కరెంట్ షాక్ తో మృతి చెందినది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…గురువారం తన మేకల ను గ్రామ సమీపంలోని పొలాలలో మేపుతుండగా ఓ మేక మేతమేసుకుంటూ వెళ్లి కరెంటు స్తంభాన్ని తాకడంతో వర్షం కారణంగా విద్యుత్ షాక్ తగలడంతో మేక అక్కడికక్కడే మృతి చెందింది. మేక విలువ సుమారు 15 వేలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు.