ఆగస్టు 31న పెద్దపల్లి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన.

పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి.

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న డిప్యూటీ సీఎం

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, ఆగస్టు-29:

ఆగస్టు 31న పెద్దపల్లి జిల్లా రామగుండంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించ నున్నారని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9.45 గంటలకు రామగుండంలో ఏర్పాటు చేసే హెలి ప్యాడ్ కు చేరుకుంటారని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 10:30 నిమిషాల వరకు టిఎస్ జెన్ కో 800 మెగా వాట్ల పవర్ ప్లాంట్ సైట్ సందర్శిస్తారని, ఉదయం 10:30 నుంచి 10:45 వరకు గోదావరిఖని లో నిర్మించిన స్కిల్ సెంటర్ సెక్టార్ 2 ను ప్రారంభిస్తారని, ఉదయం 10.45 నుంచి 11.30 వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి, అమృత్ 2 నిధుల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో నిర్వహించే బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పాల్గొంటారని జిల్లా కలెక్టర్ తెలిపారు.డిప్యూటీ సీఎం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు సింగరేణి ఆర్జి 1 లోని మేడిపల్లి మినీ ఓపెన్ కాస్ట్ మైనింగ్ సందర్శిస్తారని , మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 వరకు ఇల్లెందు అతిథి గృహంలో లంచ్ ఉంటుందని, అనంతరం డిప్యూటీ సీఎం మంచిర్యాల జిల్లా పర్యటనకు బయలు దేరుతారని కలెక్టర్ తెలిపారు.పెద్దపల్లి జిల్లాలోని డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.