*నిలిచిపోయిన ఆర్ఎంపి, పిఎంపీల వైద్య సేవలు*

*నిత్యం 400 నుండి 500 వరకు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు*

*మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు*

*విష జ్వరాలతో అవస్థలు పడుతున్న రోగులు*

*ఆర్ఎంపి, పిఎంపీల పై ఎందుకి దాడులు*

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ పట్టణంలోని 30 పడకల ఆసుపత్రికి చుట్టుపక్కల గ్రామాల నుండి గత రెండు రోజులుగా ఆర్ఎంపి, పిఎంపీల వైద్య సేవలు నిలిచిపోవడం దీనికి తోడు విష జ్వరాలతో పాటు, సీజనల్ వ్యాప్తి చెందడంతో, నిత్యం 400 నుండి 500 మంది వరకు ప్రభుత్వ దవఖానకు వస్తున్నట్లు సమాచారం. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపి ప్రారంభం కాకముందు చుట్టుపక్కల గ్రామాలైన గొల్లపల్లి, పూసాల, కనుకుల, రేగడి మద్దికుంట, కదంబపూర్, గట్టెపల్లి, నీరుకుల్ల, తొగర్రాయి, గ్రామాల ప్రజలు ఓపి కోసం నమోదు చేసుకునేందుకు గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవాల్సి రావడంతో రోగులు అవస్థలు పడుతూ, నిలబడే శక్తి లేక స్థలం దొరికిన చోటే కూర్చుండి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో బెడ్లు ఖాళీ లేవంటూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీల, పీఎంపీల సేవలు నిలిచిపోయినందువలన ప్రభుత్వ ఆసుపత్రికి భారీగా క్యూ కడుతున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

*ఆర్ఎంపి, పిఎంపీల పై దాడులు…*

జిల్లావ్యాప్తంగా వందలాదిమంది ఆర్ఎంపి, పిఎంపీలు అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలలో సేవలందిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ స్థాయి వరకు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ డాక్టర్లు సిబ్బంది నిత్యం రావడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంత వాసులకు ఆర్ఎంపి, పిఎంపీల వైద్య సేవలో దిక్కవడంతో చాలామంది ప్రజలు వీళ్లను నమ్ముకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కొంతమంది ఆర్ఎంపి, పిఎంపీలు ప్రాథమిక చికిత్స కే పరిమితం కాకుండా శస్త్ర చికిత్సలు చేస్తున్నారని కొన్నిచోట్ల వైద్యం వికటించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలా తెలిసి తెలియని వైద్యం చేసి వికటించినప్పుడు కేసులను డాక్టర్ల వద్ద పంపిస్తారని అప్పటికే రోగి పరిస్థితి విషమించడంతో ఏదైనా జరిగితే డాక్టర్లపై నెట్టేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ప్రాథమిక చికిత్సకు పరిమితం కావలసినవారు హద్దులు దాటుతున్నారని అవగాహన లేక ఆంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తున్నారనే సమాచారంతో ఇటీవల పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఆంటీ క్వాకరి బృందం, హెచ్ ఆర్ డి ఏ సెక్రటరీ లు పలు దాడులు నిర్వహించి కొంతమంది ఆర్ఎంపీలు, పీఎంపీలపై దాడులు నిర్వహించి ఎన్ఎంసీ చట్ట ప్రకారం 34,54 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ వీరి సేవలు నిలిచిపోతే మాత్రం రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు వైద్య సేవల సమస్యలు తలెత్తే పరిస్థితి లేకపోలేదు.