ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు. 

మాజీ సర్పంచ్ చంద శంకర్.

యూత్ కాంగ్రెస్ నాయకులు కందుల అశోక్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిరూరల్:
పెద్దపల్లి మండలం సబ్బితం లోని గట్టుసింగారం జలపాతం (వాటర్ ఫాల్) వెళ్ళు రోడ్డు గత 10 సంవత్సరాల నుండి గుంతలు పడి బురద మయంగా మారి వర్షాకాలం వచ్చి దంటే గ్రామం లోని రైతులు పొలం పనులకు వెళ్ళాలన్నా, పర్యాటకులు జలపాతం సందర్శనకు వెళ్ళాలన్నా అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మరమ్మతులు చేయాలని పెద్దపల్లి శాసన సభ్యులు ఎమ్మెల్యే విజయరమణ రావు దృష్టికి తీసుకు వెళ్ళటంతో గత నెలలో తనే స్వయంగా జలపాతం వద్దకు వచ్చి బురద గుంతలతో వున్న రొడ్డును జలపాతాన్ని పరిశీలించి రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే అప్పటికప్పుడే రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేయుటకు మొరం వేసి చదును చేయిస్తానని హామి ఇచ్చిన నెల రోజులలోనే అత్యవసర పనుల క్రింద 5 లక్షలు రూపాయలు కేటాయించి పనులు చేయుటకు ఆదేశించారు. అట్టి నిధులతో సబ్బితం నుండి గట్టు సింగారం జలపాతం వరకు రోడ్డుకు ఇరు వైపుల వున్న చెత్త,ముళ్ళపొదలను జెసిబి ద్వారా తొలగించి రోడ్డు పై మొరం పోసి చదును చదును చేశారు. రోడ్డు మరమ్మత్తులతో సబ్బితం ఆయకట్టు రైతులు,ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ చంద శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకుడు కందుల అశోక్, గ్రామ శాఖ అధ్యక్షులు కీర్తి హరీష్, మధాసు రాజయ్య,కల్లిపెల్లి కిష్టయ్య,నూనె రమేష్,గుమ్మడి ప్రసాద్ పాల్గొని ఎమ్మెల్యే విజయరమణారావుకి కృతజ్ఞతలు తెలిపారు.