* పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు.
* అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్.
* గ్రామీణ క్రీడ రంగానికి అధిక ప్రాధాన్యత.
* గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసింది.
* జిల్లాకు చేరిన సీఎం కప్ క్రీడాజ్యోతి.
అగ్నిధారన్యూస్,అక్టోబర్-14 : రాష్ట్రంలో క్రీడా రంగం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, క్రీడల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపే దిశగా కృషి చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు.సీఎం కప్ రిలే ర్యాలీ సోమవారం సుల్తానాబాద్ పట్టణం శాస్త్రి నగర్ నుండి ప్రారంభమై ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వరకు పెద్దపల్లి డివైఎస్ఓ సురేష్ ఆధ్వర్యంలో కొనసాగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నవంబర్లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుందని అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సైతం విద్యార్థులను క్రీడలు ఆడే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా క్రీడాకారుడు కావడంతో క్రీడల పట్ల మక్కువ చూపిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు ఉన్నత ఉద్యోగాలతోపాటు నగదు పురస్కారాలు, ముఖ్య కూడళ్లలో ఖరీదైన స్థలాలు ఇస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం క్రీడా రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సుల్తానాబాద్ పోలీస్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కన్నం మధు నోడల్ ఆఫీసర్, గోకుల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, రతన్ కుమార్ బోస్ స్పోర్ట్స్ ఆఫీసర్, ఎండి గౌస్ నేషనల్ అథ్లెటిక్ కోచ్,సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, పెద్దపల్లి ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్, పెద్దపల్లి జిల్లా పేట అధ్యక్షుడు వేల్పుల సురేందర్, జనరల్ సెక్రెటరీ దాసరి రమేష్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కడారి రవీందర్, మాజీ ఎస్ జి ఎఫ్ కార్యదర్శి శంకరయ్య,బైరగోని రవీందర్, దాసరి ప్రసాద్, అంతర్జాతీయ క్రీడాకారుడు గెల్లు మధుకర్, కుమార్ కిషోర్,క్రీడా సంఘాల నాయకులు పెద్దపల్లి జిల్లా రబ్బి అసోసియేషన్ అధ్యక్షుడు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొల్లి సత్యనారాయణ, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గట్టయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రణయ్, కుమార్, సదానందం, వెంకటేష్, హరికృష్ణ, ఇక్బాల్, శివ, అజ్జు, సతీష్, పవన్, సంపత్, మున్సిపల్ చైర్ పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, , క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


