అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరాధ్య పండగ సద్దుల బతుకమ్మ విజయదశమి పండుగలు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామాల్లో గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
సద్దుల బతుకమ్మ రోజు….
గ్రామంలో వేకువ జామున ప్రజలు మేలుకొని భక్తి పారవశ్యంలో మునిగితేలారు. గ్రామంలో ప్రకృతి పరంగా సాహస సిద్ధంగా లభించే గునుగు,తంగెడ, పట్టుకుచ్చులు, బంతి, మొదలగు పువ్వులతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం 6:00 నుండి ఉదయం 4 గంటల వరకు బతుకమ్మలు ఆడిపాడుతూ,మహిళలు పిల్లలు ఆనందంగా గడిపారు. బతుకమ్మలు ఆడుకునే ప్రదేశాలలో కావలసిన ఏర్పాట్లను గ్రామపంచాయతీ అధికారులు, సిబ్బంది సమకూర్చారు. అదేవిధంగా బతుకమ్మలు ఆటలాడే ప్రదేశాలలో చల్లటి మంచినీటి సౌకర్యాన్ని గ్రామ యువకులు స్వచ్ఛంద ఏర్పాటు చేశారు.
విజయదశమి జమ్మి పూజలు..
గ్రామ ప్రజలు.. యువకులు ఉదయం 8 గంటలకు ఎడ్లబండ్లతో అడవికి వెళ్లి జమ్మి చెట్టు తీసుకువచ్చారు. స్థానిక చెన్నకేశవ ఆలయ ప్రాంగణంలో, జమ్మి చెట్టును ప్రతిష్టింపజేసి పక్కనే హనుమాన్ ఆలయంలోని దుర్గామాతకు పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రజలు జమ్మి చెట్టు వద్దకు చేరి, పూజలు చేసిన అనంతరం,జమ్మి ఆకులను ఒకరికొకరి ఆప్యాయంగా ఇచ్చుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణ పండగ ఉత్సవాలను జరుపుకున్నారు. శమీ పూజ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ సిలారపు సత్యం, ఏఆర్ ASI వినోద్ కుమార్, మాజీ సర్పంచ్,మెట్టు దేవేందర్ సొసైటీ డైరెక్టర్, మెట్టు సమ్మయ్య, పెర్క సంతోష్, సిలారపు శ్రీనివాస్, పల్లె సదానందం, సిలారపు హరీష్ రాయగట్టు, మెట్టు రమేష్, శ్రీనివాస్, తిరుపతి, రాజేందర్, నెత్తెట్లా బాపు, బత్తుల రాజయ్య, వెంకట్ రెడ్డి, చందు, సంపత్, నామని రాజేశం, కుడుదుల నరసయ్య, సిలారపు అనిల్, సిలారపు కొమురయ్య, సదయ్య అయ్యగారు శ్రీనివాస్, మల్లేష్, సతీష్,దుర్గాప్రసాద్ తో పాటు భవాని మాత మాలదారులు, సిలారం సమ్మయ్య,వెంకటేష్, ,పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.





