నూతన బస్ ను ప్రారంభించిన శాసనసభ్యులు
అగ్నిధారన్యూస్ ( ఓదెల )
ఓదెల మండలంలోని రూప్ నారాయణపేట,శానగొండ, పొత్కపల్లి మీదుగా సుల్తానాబాద్ బస్ సౌకర్యాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు గురువారం సద్దుల బతుకమ్మ పండుగ రోజు అన్ని వర్గాల ప్రజల సౌకర్యార్థం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించడం రేవంత్ సర్కార్ తోనే సాధ్యమైందని ఆయన అన్నారు. రూపునారాయణపేట, గొల్లపల్లి గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యం లేదని ప్రజలు నా దృష్టికి తీసుకురాగా హుజురాబాద్ డిపో మేనేజర్ తో మాట్లాడి జమ్మికుంట గుంపుల మీదుగా ఇందుర్తి, బయమ్మపల్లి, శానగొండ, గొల్లపల్లి, రూపునారాయణపేట మీదుగా పాత్కపల్లి, మడక కనగర్తి మీదుగా సుల్తానాబాద్, కరీంనగర్ బస్టాండుకు వెళ్లే విధంగా సౌకర్యం కల్పించామన్నారు. బస్సు సౌకర్యాన్ని ఆయా గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దసరా తర్వాత రూపునారాయణపేట, బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటామని తెలిపారు. రూపునారాయణపేట, గొల్లపల్లి మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు సర్వే నిర్వహించారని త్వరలోనే ఫ్లైఓవర్ పనులు ప్రారంభం అవుతాయి అన్నారు. మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ రవాణా సౌకర్యం సులభతరం చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.
