సిఐ సుబ్బారెడ్డి

అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్,ఏప్రిల్1. ప్రజల దాహార్తి తీర్చేందుకే చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి అన్నారు.సుల్తానాబాద్ మున్సిపల్ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ వలస నీలయ్య తల్లిదండ్రులు వలస కాంతమ్మ-వీరేశం ల జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి హాజరై చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ, ఎండాకాలం మంచినీరు చాలా ముఖ్యమైనదని, నీరు ఎక్కువగా సేవించని వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని, బస్టాండ్ ఆవరణలో ప్రయాణికుల సౌకర్యార్థం త్రాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు లయన్స్ క్లబ్ వారిని అభినందిస్తున్నామని అన్నారు. వల్స నీలయ్య మాట్లాడుతూ మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ప్రయాణికులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలో తెలంగాణ చౌరస్తాలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు.

కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కో- ఆర్డినేటర్ వలస నీలయ్య, మాటేటి శ్రీనివాస్ కార్యదర్శి పిట్టల వెంకటేశం, కోశాధికారి పూసాల సాంబమూర్తి సభ్యులు పెరుమండ్ల హర్ష చక్రవర్తి, దావల్ల నరేందర్, ఆడెపు సదానందం,ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.