– 04 కార్లు స్వాధీనం.
– 01 సెల్ ఫోన్ సిజ్.
అగ్నిధారన్యూస్ గోదావరిఖని టౌన్ ఆగష్టు 8
గోదావరిఖని ఎల్బీనగర్ కి చెందిన బోడ తిరుపతి (తండ్రిపేరు) లక్ష్మయ్య, ఎల్ బి నగర్ మారుపెల్లి ప్రణయ్ భాస్కర్ డ్రైవర్ అనే వ్యక్తి తన కారు, ఇంకా కొంతమంది మంది కార్లు కూడా కుదువ పెట్టి తిరిగి ఇవ్వడం లేదు అని కావున నా కారు నాకు ఇప్పించి నాకు తగు న్యాయం చేయగలరని ప్రణయ్ భాస్కర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా ఫిర్యాదు ఆధారంగా గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. నిందితున్ని పట్టుకొని విచారించి నిందితుడు ఎవరి ఎవరి వద్ద కార్లు కుదవ పెట్టాడో వారి వద్ద నుండి నాలుగు కార్లు స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ తరలించి నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపడం జరుగుతుంది అని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ వివరాలు వెల్లడించడం జరిగింది.
వివరాల్లోకి వెళితే…
నిందితుడు ప్రణయ్ భాస్కర్ కారు డ్రైవర్ గా పని చేస్తూ వచ్చిన డబ్బులు జల్సాలకు, చెడు అలవాట్లకు సరిపోక స్నేహితుల వద్ద డబ్బులు చేబదులు తీసుకోని అవి వారు అడగగా తను కిరాయికి తీసుకొని వచ్చిన కార్లు, తెలిసిన వాళ్ళ వద్ద నుండి కార్లను కిరాయికి నడిపిస్తాను నెల నెల కిరాయి ఇస్తా అని చెప్పి నమ్మించి కొన్ని రోజులు కిరాయి ఇవ్వడం తరువాత కొద్ది రోజులకు జల్సాలకు అలవాటు పడిన ప్రణయ్ భాస్కర్ తను తెలిసిన వాళ్ళ వద్ద కార్లు తనఖా పెట్టిన వారి దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుండి సుమారు రెండు లక్షల నుండి మూడు లక్షల వరకు తీసుకొని జల్సాలు చేస్తూ కార్ యజమానులకి డబ్బులు ఇవ్వకుండా ఫోన్లో స్పందించకుండా హైదరాబాదులో తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ విధంగా సుమారు 10,00 000 లక్షల రూపాయల వరకు కార్లు కుదవ పెట్టి డబ్బులు తీసుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ…
పోలీస్ తరుపున ప్రజలకు తెలపడం ఏమనగా ఎవ్వరు కూడా తమ అవసరాల కోసం వాహనాలు తనఖా పెట్టుకునే ముందు వాళ్ళ పూర్తి వివరాలు తెలుసుకువాలి సరయగు పత్రాలు ఉండేలా చూసుకోవాలి. అదేవిదంగా డబ్బులు ఇచ్చే వాళ్ళు కూడా వాహనాల అసలు యజమాని వాళ్ళ వివరాలు, పూర్తి పత్రాలు తప్పనిసరిగా చూడాలి. వాహనం కు సంబందించిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు తనఖా పెడితే తీసుకోని డబ్బులు ఇవ్వడం వలన ఇబ్బందులు పడవలసి వస్తుంది ఇట్టి చర్య చట్టరీత్యా నేరం కావున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు. నిందితున్ని పట్టుకొని కార్లు స్వాధీనం చేసుకోవడం కోసం కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్స్ రమేష్, సదానందం, కానిస్టేబుల్ మధుకర్, రమేష్ లను ఏసీపీ అభినందించారు.
