ఇసుక అక్రమ రవాణా చేయొద్దని వారం రోజుల క్రితం నుండి హెచ్చరకలు

– వినకపోవడంతో నేరుగా సీన్ లోకి మంథని ఎస్సై

– ఒక జేసీబీ 2 ట్రిప్పర్లు,డంప్ యార్డ్ సీజ్.

– పలువురిపై కేసు నమోదు చేసిన ఎస్సై

అగ్నిధార న్యూస్ మంథని :

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గత నాలుగు రోజులుగా మంథని ఎస్సై డేగ రమేష్ తన సిబ్బంది తో కలిసి ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై విస్తృత తనిఖీలు చేస్తుండగా గురువారం రాత్రి మంథని మండలం కన్నాల గ్రామ శివారులోని మల్లయ్య ఇటుక బట్టి లో గోదావరినది నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఎలాంటి అనుమతి లేకుండా దొంగతనంగా ఇసుకను తరలించి అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను జేసీబీ సహాయంతో రెండు టిప్పర్ లలో ఇసుకను జగిత్యాలకు అక్రమంగా తరలిస్తున్న రెండు టిప్పర్లను టీఎస్ 22టీఏ 1826 2.టీఎస్ 02 యూసి 2724 టిప్పర్లను,జేసీబీ ,ఇసుక డంపును ఎస్సై సీజ్ చేసి కేసు నమోదు చేసారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంవాసం సతీష్ R/o పాసిగం గ్రామం వెల్గటూర్ మండలం జగిత్యాల జిల్లా ముష్కి రాజ్ కుమార్ తండ్రి సతీష్ గ్రామం లక్కారం ప్రస్తుతం సెంటినరీ కాలనీఎర్రం సంతోష్ తండ్రి చంద్రయ్య వయసు 33, కులం తెలుగు, గ్రామం మైదంబండ ముత్తారం మండలంతనుగుల మహేష్ తండ్రి తిరుపతి వయసు 34, కులం పెరిక గ్రామం రాయపట్నం, ధర్మపురి మండలం జగిత్యాల జిల్లా తన్నీరు మల్లికార్జున్ తండ్రి రాములు , వయసు 35 , కులం వడ్డెర, జగిత్యాల.పొట్ల రాజశేఖర్ తండ్రి రామ్ చందర్ , వయసు 32 , కులం ఎస్సీ మాదిగ , గ్రామం లద్మాపూర్ , రామగిరి మండలం. పోయిల భాస్కర్ తండ్రి శంకర్ , వయసు 28, కులం ఈఎస్సీ మాదిగ, గ్రామం కన్నాల మంథని మండలం పిక్కల మల్లయ్య ఇటుక బట్టి ఓనర్
అని మంథని ఎస్సై రమేష్ తెలిపారు.అదేవిధంగా మంథని మండలంలోని ప్రజలు ఎవరైనా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను నిలువ చేసిన తరలించిన వారిపైన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై రమేష్ హెచ్చరించారు.