చినుకు పడితే చిత్తడే.
స్పెషల్ ఆఫీసర్ పరిపాలన సమస్యలే వలయం.
వాహనదారుల కష్టాలు పట్టించుకోని అధికారులు.
రహదారిపై సర్కస్ ఫీట్లు.
మరమ్మతులు చేపట్టాలని డిమాండ్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గల ప్రధాన అంతర్గత రహదారి ప్రధాన చౌరస్తా అయినా ( మోరి వద్ద నుండి )ఎలబోతారం రాజయ్య ఇంటి వద్ద నుండి అండర్ గ్రౌండ్ రోడ్డులోకి వెళ్లే ప్రధాన రహదారి (సర్కార్ భావి వరకు ) 20 ఏళ్ల క్రితం వేసిన సిసి రోడ్డు సంవత్సర కాలం క్రితం ఇసుక మట్టి అధిక లోడు టిప్పర్ల వల్ల ధ్వంసమైన రోడ్డు నేటికీ మరమ్మత్తులకు నోసుకోలేదు. గ్రామంలోని ప్రజలు, వాహనదారులు, పాదచారులు, ఇప్పుడు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. పాలకవర్గం లేకపోవడం వల్ల పట్టించుకునే నాధులే కరువయ్యారు.స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలో గ్రామం సమస్యల వలయంలోకి నెట్టబడింది. సాక్షాత్తు మండల పంచాయతీ అధికారే కొత్తపల్లి గ్రామపంచాయతీకి ప్రత్యేక అధికారి అయినప్పటికీ నిధుల లేకన.. నిర్లక్ష్య వైఖర తెలియదు కానీ నడిరోడ్డు పైన చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్న గుంతలతో రహదారి అంతా చిత్తడిగా మారుతుంది. నీటి నిలువలతో రోడ్డుపై గ్రామ ప్రజలు, స్కూలుకు వెళ్లే విద్యార్థులు, సర్కస్ ఫీట్లు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజల సౌకర్యార్థం, రోడ్డుపైన ఇప్పటికైనా తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
సబ్బు మల్లయ్య బిజెపి మండల పార్టీ ఉపాధ్యక్షులు.
గ్రామ ప్రజలంతా నిత్యం నడిచే ప్రధాన అంతర్గత రహదారి మొత్తం గుంతల మయం కావడం వల్ల వాహనదారులకు, వృద్ధులకు, పిల్లలకు, ఇబ్బంది కలుగుతుంది. నీటితో నిండి ఉన్న గుంతల వల్ల రోడ్డు కనబడుతలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. లేనట్లయితే ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తా.