కోట చిరంజీవి హత్య కేసులో నిందితుల అరెస్ట్.
24 గంటల్లో నిందితుల అరెస్ట్ రిమాండ్ కి తరలింపు
వేధింపులు, బెదిరింపులు తట్టుకోలేక హత్య
అగ్నిధార న్యూస్,( రామగుండం): పెద్దపల్లి జోన్ రామగిరి మండలం సెంటినరి కాలనీ డి ఆర్ డి ఏ, టిజీ ఎస్ ఇ ఆర్ ఎఫ్ ఆఫీస్ వద్ద జరిగిన హత్య కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు గోదావరిఖని ఏసిపి ఎం రమేష్ శనివారం రోజున వెల్లడించారు.
మృతుని వివరాలు
కోట చిరంజీవి తండ్రి రాజయ్య 35 సంవత్సరాలు కులం ఎస్సీ నేతకాని, న్యూ మారేడుపాక
నిందితుల పూర్తి వివరాలు.
ఏ1. పొలవైన సంధ్యారాణి భర్త పేరు: కుమార్, వయసు :34 సంవత్సరాలు , కులం: తెనుగు గ్రామం :పెంచికల్ పేట్
ఏ2 .అనవేనా మల్లయ్య, తండ్రి పేరు :రాములు, వయసు :62 సంవత్సరాలు,కులం: తెనుగు గ్రామం :పెంచికల్ పేట్
ఏ3. అనవేన నరేష్, తండ్రి పేరు: మల్లయ్య, వయసు :37 సంవత్సరంలు ,కులం: తెనుగు గ్రామం :పెంచికల్ పేట్
ఏ4. పొలవెన కుమార్, తండ్రి పేరు: సాయిలు ,వయసు: 36 సంవత్సరంలు, కులం :తెనుగు గ్రామం :పెంచకల్ పేట్
ఏ5. పిడుగు చందు, తండ్రి పేరు :లచ్చయ్య, వయస్సు: 26 సంవత్సరాలు, కులం :తెనుగు గ్రామం పెంచికల్ పేట్
స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు
మూడు బైక్ లు ,హత్య కు ఉపయోగించిన వస్తువులు
తేదీ 10-10-2025 రోజున మృతుడు కోట చిరంజీవి తమ్ముడైన కోటా రామ్ చరణ్ ,తండ్రి పేరు: రాజయ్య వయసు :29 సంవత్సరంలు, కులం :ఎస్సీ నేతకాని ఫిర్యాదు మేరకు రామగిరి లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, పెద్దపెల్లి డిసిపి కరుణాకర్ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు లో భాగంగా హత్య కు పాల్పడిన నిందితులను పట్టుకొనుటకు మడత రమేష్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గోదావరిఖని ఆధ్వర్యంలో మంథని సీఐ రాజు, గోదావరిఖని 2 టౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగిరి ఎస్ ఐ లు టి శ్రీనివాస్, పి దివ్య కమాన్ పూర్ ఎస్ఐ ప్రసాద్, ముత్తారం ఎస్ ఐ రవి కుమార్, సిబ్బంది శనివారం రోజున ఐఓసీ పెట్రోల్ బంక్ దగ్గర గల పెంచికల్ పేట్ ఎక్స్ రోడ్ వద్ద ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు మోటార్ సైకిల్ పై వెళ్తుండగా పట్టుకొని వారిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నట్టు ఏసీపీ తెలిపారు.
వివరాల్లోకి వెళితే…
మృతుడు కోట చిరంజీవి తండ్రి రాజయ్య 35 సంవత్సరాలు కులం ఎస్సీ నేతకాని చెందిన అనునాతడు న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన నివాసుడు. ఇతను పోతన కాలనీలో మీ సేవా సెంటర్ ని నడుపుకుంటూ జీవిస్తాడు. ఇతని భార్య 2019 సంవత్సరంలో చనిపోయినది. నిందితురాలు ఒకరోజు పని నిమిత్తం పోతన కాలంలోని మీ సేవకు వెళ్ళినప్పుడు చిరంజీవిని కలిసింది. అప్పటి నుంచి నిందితురాలికి చిరంజీవి కాల్స్ తోపాటు మెసేజ్ చేసేవాడు. ఆ క్రమంలో మృతుడు నిందితురాలు అంటే ఇష్టమని తనతో ఉంటానని చెప్పి ఒప్పుకొక పోతే చంపుతానని బెదిరించడంతో నిందితురాలు భయపడి అతనితో మాట్లాడేది. కొంతకాలం తర్వాత అతనితో మాట్లాడక పోవడం, అతని దూరం పెట్టడం చేయడంతో నిందితురాలని, తన భర్తని, తల్లిదండ్రులను చంపుతానని బెదిరించేవాడు. రెండు నెలల క్రితం మృతుడి చిరంజీవి వేధింపులు భరించలేక నిందితురాలు తన భర్తకు విషయం తెలుపడం జరిగింది. మృతుడు నిందితురాలు భర్తకు ఫోన్ చేసి నిన్ను నీ భార్యని చంపుతా మీ పరువు తీస్తా అంటూ బెదిరించేవాడు. నెల రోజుల క్రితం ఊర్లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ కూడా నిర్వహించడం జరిగింది. అయినా మృతుడు చిరంజీవి ప్రవర్తనలో మార్పు రాక పోగా నిందితురాలి ఊర్లో అందరితో తన గురించి చెడుగా చెప్తూ పెళ్లి చేసుకున్నానని, అతనితో లేచిపోయినది అని చెడుగా చెప్పేవాడు. తేది :10-10-2925 రోజున నిందితురాలు పనిచేసే సెంటినరీ కాలనీ సమైక్య కార్యాలయం వద్దకు చిరంజీవి రావడంతో సంధ్య రాణి భయపడి తన భర్త మరియు అన్నయ్య కు ఫోన్ చేసి రమ్మనీ చిరంజీవి ఎంత చెప్పినా వినకుండా ఇబ్బంది పెడుతున్నాడని ఎలాగైనా అతని చంపాలని నిందితురాలు అన్న నాన్న మరియు భర్తతో చెప్పింది. చిరంజీవి ఆఫీస్ వద్దకి వచ్చి నిందితురాలి తో గొడవ పడుతుండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన నిందితురాలి అన్న, భర్త,తండ్రి మరియు బావమరిది చిరంజీవితో గొడవపడి చేతులతో కొట్టి చిరంజీవిని ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో నిందితురాలు తండ్రి తనతో తీసుకువచ్చిన ఇనుపరాడు మరియు చాకుతో గాయపరచగా, అన్న మరియు బావమరిది అతని గట్టిగా పట్టుకున్నారు. నిందితురాలి తండ్రి చిరంజీవిని చంపాలని ఉద్దేశంతో రాడుతో చాలాసార్లు చిరంజీవి తలపై కొట్టడంతో తలపై బలమైన గాయమై అక్కడికక్కడే మరణించినట్లు వెల్లడించారు.