జిల్లాలో బెల్ట్ షాపులు ఎక్కడ లేవు సార్…

ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
జిల్లాలో ఎక్సైజ్ శాఖ ద్వారా నిర్వహించబడే మద్యం దుకాణాల టెండర్ల లైసెన్స్ గడువు దగ్గర పడుతుంది. మరో రెండు సంవత్సరాలకు గాను కొత్తగా ఒకవైపు మద్యం దుకాణాలకి దరఖాస్తులకు ఆహ్వానం పలికింది. టెండర్ వేసిన షాపులకు రేపు ఎవరికి వస్తుందో ఎవరికి రాదు తెలియనీ పరిస్థితి.నిన్న మొన్నటి వరకు దసరా సందడి, అందులోనే స్థానిక సంస్థలు ఎన్నికల కోలాహలం నెలకొనడంతో జిల్లాలో కల్తీ మద్యo అమ్మకాలు ఏరులై పారిందనీ మద్యం ప్రియులు, మొత్తుకుంటున్నారు.పెద్దపల్లి జిల్లా పరిధిలో గోదావరిఖని మంథని సుల్తానాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో పరిధిలో 74 వైన్ షాపులు నడుస్తున్నాయి. లైసెన్సు పొందిన 74 దుకాణాల గడువు నవంబర్ తో ముగుస్తుంది. గడువు ముగిసేలోపు ఎలాగైనా గట్టిగ సంపాదించాలి అనుకున్నారేమో…. ఆయా షాపుల పరిధిలోని బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు పెట్టారు. నిఘా లోపమా, నిద్రావస్థలో ఉన్నారో, తెలువదు కానీ, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎక్సైజ్ శాఖ అధికారులు బెల్ట్ షాపులపై మనసు పెట్టకపోవడంతో బెల్ట్ షాపులలో ఆడింది ఆటగా పాడిందే పాట అన్నచందంగా మద్యం కల్తీ అవుతుంది. రెండు రోజుల క్రితం ఓ మద్యం ప్రియుడు పెద్దపల్లి మండలంలోని ఓ గ్రామంలో బెల్ట్ షాపు వద్ద మెన్షన్ హౌస్ రెండు క్వార్టర్లు 400 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. కొనుగోలు చేసిన సీసాలను చూడగానే వినియోగదారుడికి పిచ్చెక్కింది. ప్రతిరోజు తాగుతుంది కల్తీ మంద అసలు మంద తేల్చుకోలేకపోయాడు. ఒక సీసా ఫుల్లుగా నింపి ఉండడం, మరొక మామూలుగా ఉండడం చూసి నివ్వరపోయాడు. ఇదే విషయం బెల్ట్ షాప్ నిర్వాహకుని అడుగుతే మేము తీసుకువచ్చిన షాపు నుండి ఇలానే వచ్చింది, మేము దీన్ని తయారు చేయడం కదా అన్నాడు.మీకు అభ్యంతరం లేకుంటే అది వాపస్ ఇవ్వండి ఇంకొకటి ఇస్తాను. ఇదే విషయం అగ్నిధారకు సమాచారం అందించగా సీసాలను పరిశీలించగా రెండు సీసాల్లో ఉన్న మందు కొలతలు తేడాగా కనిపించింది. విషయం ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్న ఓ అధికారి దృష్టికి తీసుకువెళ్తే, వైన్ షాపులలో ఎక్కడ కల్తీ జరుగుతలేదన్నారు . బెల్ట్ షాపుల్లోనే ఆమందు కల్తీ జరిగి ఉంటుందన్నారు. కల్తీ మందు అమ్ముతున్న ఆ దుకాణంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. బెల్ట్ షాప్ లపై నియంత్రణ ఏది అన్నప్పుడు, ఆ అధికారి మా దృష్టికి జిల్లాలో ఎక్కడ బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు రాలేదు అనడం కోస మెరుపు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం జిల్లాలో ఊరురా వాడ వాడ వందల వేల సంఖ్యలో ఉన్న బెల్ట్ షాపులలో యదేచ్చగా అక్రమ కల్తీ మధ్యమాలు అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న, మద్యం కల్తి జరుగుతున్న పట్టించుకోనే నాథుడే లేడు, వందలాది రూపాయలు ఖర్చుపెట్టి తాగిన, ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేదు, గాలికి వదిలేసినట్లే అనేది ఇక్కడ గమనించాలి. కల్తీ మద్యo అనేది ఒక పెద్దపల్లి మండలానికే కాకుండా జిల్లాలోని అన్ని గ్రామాలలో దంద జరుగుతుంది. ప్రజల ప్రాణాలు కాపాడడానికి గ్రామాల్లో పాలకులు లేరు..! అధికారులు రారు…!! కాబట్టి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి జరబద్రం. జిల్లాలో ఎక్కడ బెల్ట్ షాపులు లేవు అనుకుంటున్నా ఎక్సైజ్ అధికారులు, ఇప్పటికైనా మేల్కొని తమ విధులకు పని చెప్పాలి, విధి నిర్వహణలో బెల్ట్ షాపులు కనిపించిన ఎట్లాగో వాటిని మూయించే సామర్థ్యం లేనప్పుడు, కనీసం కల్తీ మందు అమ్మకాలు జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలని మద్యం ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.