అగ్నిధారన్యూస్ వనపర్తి జిల్లా:

రేపటి బీసీ బంద్‌కు మద్దతుగా ‌‌‌ వనపర్తి పట్టణంలో వివిధ రాజకీయ పార్టీలు ఒకరోజు ముందుగానే తమ తమ పార్టీ జెండాలతో బైక్ ర్యాలీలు, నినాదాలు నిర్వహించడంతో వనపర్తి పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తంగా వాతావరణం నెలకొంది . పట్టణంలోని వివేకానంద చౌరస్తా, పాతబస్టాండ్, కొత్తబస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా ప్రాంతాల్లో యువత భారీగా బైక్ ర్యాలీల్లో పాల్గొంది.
ర్యాలీలను అదుపులోకి తెచ్చేందుకు పట్టణ పోలీస్ సిబ్బంది అడ్డుకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
పోలీసులు వాహనాలను పక్కదారి పట్టించడంతో పరిస్థితి క్రమంగా సర్దుమనిగింది. రేపటి బంద్ దృష్ట్యా పట్టణంలో పోలీస్ శాఖ అదనపు పోలీస్ బలగాలను మోహరుస్తున్నారు.