అగ్నిధారన్యూస్ గోదావరిఖని  BC లకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ బిసి సంఘాలు, అఖిలపక్ష పార్టీల కార్యచరణ సమితి తెలంగాణ రాష్ట్ర బందు పిలుపులో భాగంగా అఖిలపక్షపార్టీలు

సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ,
బి సి సంఘాలు, తెలుగుదేశం పార్టీలఆధ్వర్యంలోగోదావరిఖని లో వ్యాపారస్థులు స్వచ్ఛందంగా బంద్ ను పాటించి సంపూర్ణ మద్దత్తు ను తెలియచేసారు.ఈసందర్భంగా సీపీ ఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఐ కృష్ణ, బి సి సంఘాలు నాయకులు రాల బండ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏడుకొండలు మాట్లాడుతూ… బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 9ని సుప్రీంకోర్టు హైకోర్టులు కొట్టివేయడం ప్రజా వ్యతిరేకమని అభివృద్ధి నిరోధకమని వెనుకబడిన వర్గాలను ఇంకా వెనక్కి నెట్టడమే ఒకటి కాదన్నారు.ఈ తీర్పులను తీవ్రంగా నిరసిస్తు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బందు విజయవంతంగా జరిగిందనిఅందులో పాల్గొన్న ప్రజలకు అభినందనలు తెలియజేశారు.ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం42%రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ బందు కార్యక్రమం లో సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్, జిల్లా నాయకులు ఐ రాజేశం,జీ మల్లేశం, ఎం కొమరయ్య, బి రాజనర్స్, కే ధర్మేదర్,బి సి సంఘాల నాయకులు కులవేణి నరేష్,గర్వందుల శ్రీకాంత్, కూసం కిరణ్, శ్రీనివాస్ ,దుదిల్ల వెంకటేష్, బండి లక్ష్మణ్, తెలుగుదేశం పార్టీ నాయకులు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, రాజనర్స్. తదితరులు పాల్గొన్నారు.