అగ్నిధారన్యూస్ పెద్దపల్లి

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల టెండర్లకు రెండు సంవత్సరాల కాల పరిమితికి తేదీ 26.09.2025 నుండి 18.10.2025 వరకు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు దుకాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. నేటితో టెండర్ల దరఖాస్తులకు గడవు ముగియనుండడంతో రాష్ట్రవ్యాప్తంగా చివరి రోజు కావడంతో ముందుగా అనుకున్నట్లుగానే దరఖాస్తుదారుల తాకిడి పెరిగింది. ఎక్సైజ్ కార్యాలయాల వద్ద స్పష్టంగా కనిపిస్తుంది. సాయంత్రం ఐదు గంటలకు గడువు ముగిసినప్పటికీ, దరఖాస్తుదారులకు భారీగా తరలి రావడంతో, ఐదు గంటల లోపు దరఖాస్తుల స్వీకరణ ప్రాంగణంలో ఉన్న వారందరి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో నాలుగు ఎక్సైజ్ స్టేషన్ లు పెద్దపల్లి, సుల్తానాబాద్, రామగుండం, మంథని, పరిధిలో 74 మద్యం షాపులకు రెండు సంవత్సరాల గాను టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే.. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ లో కొనసాగుతుంది. మొన్నటి వరకు మందకొండిగా కొనసాగిన దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం,శనివారం దరఖాస్తుదారుల తాకిడి పెరిగింది. శుక్రవారం నాటికి మొత్తం దరఖాస్తులు 566 వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు శనివారం చివరి రోజు కావడం చేత దరఖాస్తుల వివరాలు ఎక్సైజ్ శాఖ అధికారులు గంట గంటకు ప్రెస్ కి విడుదల చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి అధికారికంగా తెలిపిన లెక్కల ప్రకారం.సాయంత్రం 8 గంటల వరకు అన్ని కేటగిరీలలో 1186 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఈ దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కౌంటర్లు పెట్టి దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికీ కొనసాగుతుంది. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది, పోలీస్ శాఖ. దరఖాస్తుదారులకు సహకరిస్తున్నారు.