– 2 కేజీల గంజాయి పట్టివేత
– పోలీసుల అదుపులో గంజాయి స్మగ్లింగ్ చేసే వ్యక్తులు
– ముగ్గురు మెజర్లు అరెస్టు , ఇద్దరు మైనర్లు.
– చాక ఛాక్యంగా స్మగ్లర్లలను పట్టుకున్నందుకు మంథని ఎస్సై రమేష్ ,సిబ్బందికి అభినందనలు.
– గోదావరిఖని ఏసీపీ మడత రమేష్
అగ్నిధారన్యూస్ మంథని :
తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి సంకల్పం, పెద్దపల్లి జిల్లాను కూడా డ్రగ్స్ ఫ్రీ జిల్లాగా చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గోదావరిఖని సబ్ డివిజన్ లో పూర్తి స్థాయిలో గాంజా, మత్తు పదార్థాలు నిషేధం చేసే విధంగా చర్యలకై మంథని పోలీస్ స్టేషన్ పరిధిలో మత్తు పదార్థాలు , గంజా స్వీకరిస్తున్నారని ముగ్గురు వ్యక్తుల పైన అనుమానాలు రావడంతో మంథని ఎస్సై డేగ రమేష్ తన సిబ్బందితో కలిసి ఏక్లాస్ పూర్ గ్రామ సమీపంలో ఉన్న గాడిదుల గండి వద్ద 2.023 కేజీల గంజాయిని మంథని పోలీసులు పట్టుకున్నారు.అనంతరం గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ముగ్గురు యువకులతో పాటు ఇద్దరు మైనర్లు ఆదివారం వారు ఎప్పటిలాగే వారు మంథని మండలంలోని గాడిదుల గండి వద్ద మొత్తం రూపాయలు 21 వేలతో సాయంత్రం బైక్ పై మహారాష్ట్ర లోని తోడ్స గ్రామానికి వెళ్లారు.అక్కడ విష్ణు వాగ్గే తో పాటు మరో వ్యక్తి దగ్గర నుండి గంజాయితో పాటు వారిని ఎవరైనా అడ్డం వస్తే బెదిరించడానికి రెండు కత్తులను కొనుగోలు చేశారు.విధంగా గంజాయిని మూడు భాగాలుగా చేసి,రెండు నల్లని కవర్లలో,ఒక తెల్లని కవర్ లో వేసి గుడ్డ చుట్టారు.అందులో ఒక నల్లని కవర్ ని ఇద్దరు ఒక గోనె సంచిలో వేసుకొని అందులో ఒక కత్తిని పెట్టుకున్నారు. రెండవ నల్లని కవర్ లో గల గంజాయి ని విమల్ పాన్ మసాలా సంచి లో వేసుకుని తన వద్ద ఉంచుకున్నాడు.తర్వాత మిగిలిన తెల్లని కవర్ లో గల గంజాయితో పాటు కత్తిని తన కాలేజీ బాగ్ లో పెట్టుకున్నాడు. సోమవారం ఉదయం ఎక్లాస్పూర్ గ్రామ శివారులో గల గాడుదుల గండి వద్దకు వెళ్లి మిగతా స్నేహితుల కోసం ఎదురు చూస్తున్నారని పక్కా సమాచారంతో మంథని పోలీస్ వారిని పట్టుకున్నారు. గంజాయి విలువ రూ.50,575 ఉంటుందని మోటార్ సైకిల్, రెండు కత్తులు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని ఏసీపీ తెలిపారు.ఏ సి పి వెంట సీఐ, ఎస్ ఐ లు, కానిస్టేబుల్ లు ఉన్నారు.