పంచనామా రిపోర్ట్ కోసం 20వేలు లంచం డిమాండ్.

ప్రైవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డి కి 10 వేలు ఫోన్ పే. చేసిన చెరుకు నాగర్జున రెడ్డి.

వెంటనే సర్వేయర్ సునీల్ కు ఫోన్ పే చేసిన రాజేందర్ రెడ్డి.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి మంగళవారం పెద్దపల్లి మండల సర్వేయర్ సునీల్, ప్రైవేట్ సర్వే రాజేందర్ రెడ్డి లను కరీంనగర్ ఏసీబీ అధికారులు పెద్దపల్లి తహసిల్దార్ కార్యాలయంలో మాటవేసి వల పన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి
గ్రామానికి చెందిన చెరుకు నాగార్జున రెడ్డి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 660, లో 10 గుంటల భూమి సర్వే కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు.
సర్వేయర్ సునీల్ వద్దకు బాధితుడు చాలా సార్లు సర్వే కోసం రావాలని కోరాడు. సర్వే అనంతరం భూసర్వే పంచనామా రిపోర్ట్ కోసం సునీల్ 20వేలు డిమాండ్ చేశారు. అంతేకాక గతంలో కూడా వేరే భూమి సర్వే కోసం 25 వేలు సర్వేయర్ సునీల్ కు ఇచ్చినట్టు బాధితుడు తెలిపారు . అయినప్పటికీ పంచనామ పత్రం విషయంలో పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడంతో, విసుకు చెందిన నాగార్జున రెడ్డి కరీంనగర్ లోని ఏసీబీ అధికారులను గత నెల ఆశ్రయించారు.జులై 9 వ తేదీన నాగార్జున రెడ్డి ఫోన్ పే ద్వారా ప్రైవేట్ సర్వేన రాజేందర్ రెడ్డి కి పదివేల రూపాయలు చెల్లించారు. బాధితుడు సర్వేర్ తో సంభాషించిన విషయాలన్నీ ఆడియో వీడియో రికార్డు కావడం జరిగింది.
మంగళవారం సునీల్, రాజేందర్ రెడ్డిలు ఇద్దరు తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న విషయం ధ్రువీకరించుకొని ఎసిబి అధికారులు చాకచక్యంగా ఇద్దరినీ వల పన్ని పట్టుకున్నారు.
సర్వేయర్ సునీల్ కి, రాజేందర్ రెడ్డి ఫోన్ పే ద్వారా నగదు బదిలీ అయినట్లు ఆధారాలు ధ్రువీకరించుకొని, ఏసీబీ కరీంనగర్ డిఎస్పి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. సర్వేయర్ సునీల్, ప్రవేట్ సర్వేయర్ రాజేందర్ రెడ్డిల పై కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని విచారించి, తదుపరి కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా
ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు.

          బాధితుడు చెరుకు నాగార్జున రెడ్డి      . ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం తీసుకోవడం తప్పయినప్పటికీ, పేద, మధ్యతరగతి, ప్రజలను కొంతమంది అవినీతి అధికారులు జలగళ్ల పట్టిపీడిస్తున్నారు. 10 గుంటల భూమిని సర్వే చేసి, పంచనామ పత్రం ఇవ్వమని అడిగితే 20వేల రూపాయలు సర్వేర్ సునీల్ డిమాండ్ చేశాడు. వేరే భూమి విషయమై 25 వేల రూపాయలు లంచం తీసుకున్నాడు. లంచం ఇవ్వడం తప్పని తెలిసినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పలేదు. మళ్లీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏం చేయాలో తెలియక ఏసీబీ అధికారులను ఆశ్రయించాను.