అగ్నిధారన్యూస్ ఎన్టీపీసీ ఈనెల రెండవ తేదీ నుండి నాలుగో తేదీ వరకు ఎన్టిపిసి జ్యోతి నగర్ జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో జరిగిన జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన్ 2025 ఇన్స్పైర్ అవార్డ్స్ లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు వాటర్ కన్సర్వేషన్ మేనేజ్మెంట్ విభాగంలో జూనియర్ స్థాయిలో ఎన్. సాద్వి జెసి ఆరవ తరగతి ప్రథమ స్థానం, సీనియర్ స్థాయిలో కే శృతి ప్రియ 9వ తరగతి ద్వితీయ స్థానం సాధించి కామారెడ్డి లో జరిగే రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికయ్యారు. ఈ ఎంపిక పట్ల గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ విద్యతోపాటు వైజ్ఞానిక రంగంలో కూడా ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని, రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రపంచాన్ని, టెక్నాలజీని ఎదుర్కొనే విధంగా విద్యార్థులను తయారు చేసే విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. విద్యార్థులను అభినందించి ప్రశంస పత్రాలు, అవార్డ్స్ ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ అల్లంకి రజనీ దేవి , ప్రిన్సిపాల్ విజయ్ , గైడ్ టీచర్ సదానందం ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది విద్యార్థులను అభినందించారు.