నిర్వాసితులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తాం.

ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే కసి రెడ్డి నారాయణ రెడ్డి.

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయి పల్లి గ్రామంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణ పనుల కారణంగా భూములు కోల్పోతున్న రైతుల సమస్యలను తెలుసుకునేందుకు నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు.
ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు రైతులు సహకరించినప్పటికీ, వారికి సరైన పరిహారం అందకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులు ప్రజాప్రతినిధులకు వివరించారు. గ్రామస్తులు చెప్పిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విన్న ఇద్దరు నాయకులు, రైతులకు అన్యాయం జరగనీయబోమని హామీ ఇచ్చారు.భూసేకరణలో న్యాయం జరిగేలా, మార్కెట్ రేటుకు అనుగుణంగా పూర్తి పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి, అధికార స్థాయిలో సమగ్రంగా చర్చించి రైతుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు.ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో రైతుల ఉపాధి దెబ్బతినకూడదని, వారి ప్రతి కుటుంబం భద్రంగా ఉండేలా ప్రభుత్వం నుండి తగిన సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రజలతో కలిసి, వారి పక్కన నిలబడి సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని తెలిపారు.గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో, పిసిసి సభ్యులు శ్రీనివాస్ గౌడ్, మార్కేట్ కమిటీ చైర్మన్ గీతా నరసింహ, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పాల కుర్ల రవి గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కరుణాకర్ గౌడ్, బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్ యాదవ్, రైతులు జోగు వీరయ్య, జోగు యాదయ్య, అన్నేపు వెంకట య్య,కేశవులు, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య, జెన్నయ్య, శ్రీను, అంజయ్య, పాండయ్య, చంద్రయ్య, శ్రీపతి బాల్రెడ్డి పావని,దిండి విజయలక్ష్మి, శ్రీపతి,శంకర్ రెడ్డి,కొండల్ రెడ్డి,సునందనమ్ బాల్ రెడ్డి,ప్రదీప్ రెడ్డి,రాఘవరెడ్డి,సమావేశానికి రైతులు, మహిళలు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను ప్రజాప్రతినిధులతో పంచుకున్నారు.