✍️ చేగొండ రవికుమార్ యాదవ్.
“అమ్మతనం” పేరుతో అక్రమ దందా..
దర్జాగా దందా..!
అనుమతులు సున్న…!!
వైద్య వృత్తిని బ్రష్టు పట్టిస్తున్న కొందరు కేటుగాళ్లు.
నిబంధనలు పాటించని ” బర్త్ ” హాస్పిటల్.
అమాయకుల నుండి ఆర్థిక దోపిడీ.
దృష్టి సారించని వైద్యశాఖ అధికారులు.
అగ్నిధారన్యూస్ హైదరాబాద్/ మంచిర్యాల క్రైమ్ విభాగం
వైద్య వృత్తి అంటే ప్రతి ఒక్కరికి గౌరవం వైద్యులు అంటే ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించే దైవం డాక్టర్ కనబడగానే రెండు చేతుల దండం పెట్టేంత గౌరవం, నమ్మకం. కానీ ఆవృత్తిని కొందరు కేటుగాళ్లు బ్రష్టు పట్టిస్తున్నారు. అవసరాలతో, వచ్చే అమాయక, ప్రజలను బురడీ కొట్టించి,, వారి అవసరాలను ఆసరా చేసుకోని కొందరు డాక్టర్ల ముసుగులో ఆర్థిక దోపిడిదారులుగా, అవతార మెత్తుతున్నవారు, వైద్య వృత్తిలో కలుపు మొక్కలుగా తయారవుతున్నారు. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యం బాగాలేక కర్మకాళీ కాలు పెడితే ఉన్న ఆస్తులు అమ్ముకొని బయటికి రావలసిన దుస్థితి దాపురించింది. మరోవైపు సంతాన లేమి సమస్యలతో బాధపడుతున్న వారి బాధ వర్ణన రహితం. మారుతున్న కాలమాన జీవన పరిస్థితుల వల్ల, లేట్ మ్యారేజీలు, పెళ్లయిన అనుకున్న సమయానికి సంతానం కలగకపోవడం వల్ల
మానసికంగా ఇబ్బంది పడుతున్న దంపతులు నేడు ఎందరో ఉన్నారు. అలాంటి వారి అవసరాలను ఆసరాగా చేసుకుని అర్హత లేని వాళ్ళు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐ వి ఎఫ్ కేంద్రాలను నెలకొల్పి నిబంధనలకు విరుద్ధంగా..
ప్రచారం మాధ్యమాలలో పెద్దపెద్ద ప్రకటనలు, జిల్లా నలుమూలల హోర్డింగులు సోషల్ మీడియా, ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లలో) పెట్టి అమాయకులను ముగ్గులోకి దింపి , ఆశల పల్లకిలోకి లాగి అర్హత లేనివారు, సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నారు. ఫెర్టిలిటీ కేంద్రాల పేరుతో, మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొన్ని హాస్పిటల్స్, అచ్చిరాని , అర్హత లేని వైద్యం చేస్తూ, ప్రసూతి కేంద్రానికి అనుమతులు తీసుకోని ఐ వి ఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ సంతాన సాఫల్య కేంద్రాలు నడుపుతున్నారు..(కృత్రిమ గర్బాదారణ ఆర్టిఫిషల్ ఇన్సమినేషన్ )కేంద్రాలు నడుపుతున్నట్లు అగ్నిధారకు పక్కా సమాచారం ఉంది. ఫెర్టిలిటీ హాస్పిటల్స్ కు ఉండవలసిన నిబంధనలను వైద్యశాఖ అధికారుల అండదండలతో తుంగలో తొక్కి కేటుగాళ్లు వైద్యం ముసుగులో అమాయకుల నుండి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. సంతానం కావాలనుకునే వారి ఆశలను మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. గైనిక్ డాక్టర్ మొదట మందుల వాడడం ద్వారా సంతానం కలుగుతుందని నమ్మిస్తారు. కొద్ది నేలపాటు మందులు ఇస్తారు. ఆ మందులతో సెట్ కావడం లేదంటూ, బాధితులకు చెబుతారు. వారి మైండ్ సెట్ మార్చుతారు. ఐ వి ఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్( ఐ వి ప్ ) ఇన్ విట్రో ఫర్టిలైజషన్.) ఆర్టిఫిషల్ ఇన్సమినేషన్ ( కృత్రిమ గర్భాధారణ )పద్ధతి ద్వారా సంతానం పొందవచ్చని చెపుతారు. ఇది నిజమే కానీ, ఐ వి ఎఫ్ చేసే అర్హత హాస్పిటల్ కు ఉందా అంటే లేదనే చెప్పాలి. లేని అర్హతలను ఉన్నట్లు అందిపుచ్చుకొని అర్హత లేని వైద్యంతో.. బాధితులను మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తూ దోపిడీ చేస్తున్నారు.
రక్తం పీల్చినట్లు లక్షల్లో వైద్యం పేరుతో గుంజుతారు. .. ఐ వి ఎఫ్ చేసే అర్హతే లేని హాస్పటల్లో ఐవీఎఫ్ పద్ధతిలో వైద్యం ఎలా..? చేస్తారు. అనేది ఇక్కడ పెద్ద మిస్టరీ. ఇదే విషయమై మంచిర్యాల జిల్లాలోనీ సంతాన సాఫల్య హాస్పటల్ జరుగుతున్న తంతుపైన మంచిర్యాల జిల్లా వైద్యశాఖ అధికారులను ( ఆర్ టి ఐ.. )సమాచార హక్కు చట్టంలో అడిగిన సమాచారంతో విస్తుపోయే నిజాలు బయటికి వచ్చాయి. హైదరాబాద్ “సృష్టి” హాస్పటల్ లో సరోగసి పేరుతో జరిగిన ఘరానా మోసం యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో “మరో సృష్టి”నీ తలదన్నే విధంగా బాగోతం నడుస్తుంది. ఆ హాస్పిటల్లో సంతాన సాఫల్య కేంద్రాలలో ఐ వి ఎఫ్ పైన శిక్షణ పొందిన డాక్టర్లు ఉన్నారా అంటే… వైద్యశాఖ అధికారులే చెప్పాలి. వైద్యశాఖ అధికారులు ఏం చేస్తున్నారు, అంటే చోద్యం చూస్తున్నారు. హాస్పిటల్ నిర్వహించాలంటే వైద్యశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. అదేవిధంగా
ఐవిఎఫ్ చేయాలి అంటే గైనకాలజీ స్త్రీ జననేంద్రియ శాస్త్రం లేదా ప్రసూతి శాస్త్రంలో అర్హతతో పాటు తప్పనిసరి మూడు సంవత్సరాలు ఫర్టిలైటీ సెంటర్ లో పనిచేయాలి+ 50 పికప్స్ చేసిన అనుభవం ఉండాలి. ఎ ఆర్ టీ లా 2021 నిబంధన ప్రకారం . ఫెలోషిప్ సూపర్ స్పెషలైజేషన్ సంతాన ఉత్పత్తి ఇన్తెర్టిలిటీలో ఫెలోషిప్ చేసి ఉండాలి.. అర్హత కలిగిన సిబ్బందితో రాష్ట్ర వైద్య మండలి చెల్లుబాటు అయ్యే విధంగా రిజిస్ట్రేషన్ కాబడి ఉండాలి. ఎ ఆర్ టీ లా 2021 యాక్ట్ పరిధిలో పనిచేయాలి.
అర్హత కలిగిన సిబ్బంది క్లినిక్ లో తప్పనిసరిగా నియమించబడాలి. గైనకాలజిస్ట్ అనస్తీసియాలజిస్ట్.. కౌన్సిలర్ తో తగిన అర్హత అనుభవం ఉన్న సిబ్బంది ఉండాలి… ఐ వి ఫ్ పద్ధతి.. చేసేముందు దంపతుల నుండి దాతలు నుండి లిఖితపూర్వకంగా డాక్యుమెంట్ ఉండాలి. లింగనిర్ధారణ నిషేధం. పిండం యొక్క లింగం ముందే నిర్ణయించడం లేదా ఎంపిక చేయడం చట్ట విరుద్ధం… అన్నింటికంటే ముఖ్యమైంది హాస్పిటల్ గతంలో చేసిన విజయాల రేట్లు, చికిత్సల ఖర్చులు నిజాయితీగా చెప్పాలి. తప్పుడు ప్రకటనలు మోసపూరిత మాటలు చట్టరీత్యా నేరం. పైన తెలిపిన అర్హతలు నిబంధనలు అనుమతులు అవి ఏమీ లేకుండా మంచిర్యాల జిల్లాలో దర్జాగా సంతాన సాఫల్య కేంద్రం పేరుతో దర్జాగా దంద నడుపుతున్న, హాస్పిటల్ పూర్తి వివరాలు ఇంకా ఉంది..
తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్ ఏ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల మంచిర్యాలలోనీ ఒకటి రెండు హాస్పిటల్స్ పైన ఫిర్యాదులు అందాయన్నారు. వాటిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అగ్ని ధారతో తెలిపారు.

