కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకం పనులు…

బ్లాస్టింగ్ జరగలేదు నాసిరకంతో కట్టారు అందుకే కూలింది…

గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ నాయకుల నిర్లక్ష్యం…

 పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..

అగ్నిధారన్యూస్ ఓదెల

ఓదెల మండలం గుంపుల గ్రామంలో మానేరుపై కట్టిన చెక్ డ్యామ్ నాసిరక నిర్మాణం స్థానిక నాయకులతో, గ్రామస్తులతో కలిసి పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. నిన్నటి నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రసారాలపైన అధికారులు నాయకులతో కలిసి మానేరులోని చెక్ డ్యామును సందర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానేరులో కాల్వ శ్రీరాంపూర్ మండలం మిర్జంపేట గ్రామంలో, ఓదెల మండలం గుంపుల, ఇందుర్తి, రూపు నారాయణపేట, పోత్కపల్లి, కొండపాక మధ్య, మడక కనగర్తి, సుల్తానాబాద్ మండలం తొగర్రాయి, నీరుకుల్ల చెక్ డ్యాములు నాసిరకంతో నిర్మించగా అవి ఆనాడే కొన్ని కుప్పకూలాయి, అన్నారు. అదేవిధంగా హుస్సేన్ మియా వాగుపై కట్టిన చెక్ డ్యాములు కూడా కుప్పకూలాయి అన్నారు. నాణ్యత లోపంతో డ్యాములు నిర్మాణం చేపడితే ఎలా ఆగుతాయని ఎమ్మెల్యే ప్రశ్నించారు, బిఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ల జేబులు నింపుకునే దురుద్దేశం తప్ప నాణ్యత పైన చిత్తశుద్ధి చూపలేదన్నారు. గుంపులలో కట్టిన చెక్ డ్యామ్ నాసిరకం కట్టడం కారణంగానే కూలిందని స్పష్టం చేశారు.ఎలాంటి బ్లాస్టింగ్ జరగలేదు అన్నారు. సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు బ్లాస్టింగ్ విషయంపై ప్రత్యేకంగా పరిశీలించారన్నారు, ఎక్కడ బ్లాస్టింగ్ జరిగిన ఆడవాళ్లు కనబడలేదని స్వయంగా పోలీసులే చెప్పడం జరిగింది స్పష్టం చేశారు. ఏ దురుద్దేశంతో,మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెక్ డాం బ్లాస్టింగ్ చేశారని సంఘటనా స్థలానికి వచ్చి చూసి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని, ఆగ్రహం వ్యక్తం చేశారు. మనోహర్ రెడ్డి హయాంలో మానేరు, హుస్సేన్ మియా వాగుపై కడుతున్న చెక్ డ్యాములను ఎప్పుడైనా వచ్చి పరిశీలించావని ఎమ్మెల్యే విజయరమణ రావు ప్రశ్నించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉండగా కమీషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లేకుండా నాసిరకంగా చెక్ డ్యాములు నిర్మించారని అందుకే చెక్ డ్యాములు కుప్పకూలుతున్నాయి అన్నారు. 10 చెక్ డ్యాములు కడితే ఇప్పటికి 8 చెక్ డ్యాములు కుప్పకూలాయి అన్నారు. బిఆర్ఎస్ అధికారంలో ఉండగా అప్పటి ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షణ లోపంతోనే నాసిరకం చెక్ డ్యాములు నిర్మించారు అన్నారు. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నాసిరకపు చెక్ డ్యాం లను సందర్శించడం జరిగిందని గుర్తు చేశారు. గుంపులలో ఎక్కడ కూడా బ్లాస్టింగ్ చేసినట్టు కనబడడం లేదని, నాసిరకం చెక్ డ్యామ్ కట్టించిన అప్పటి బీఆర్ఎస్ నాయకులు ఎక్కడ బదనాం అయితామోనని ప్లాన్ ప్రకారం బ్లాస్టింగ్ నాటకం ఆడుతున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చెక్ డ్యాంలో అక్రమాలతోనే కుప్పకూలిందన్నారు. ఇందులో అప్పటి ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ లోపం, బీఆర్ఎస్ నాయకుల వైపల్యం ఉందని ఎమ్మెల్యే అన్నారు.