బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ డిమాండ్,
తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన, వినతిపత్రం అందజేత.
అగ్నిధారన్యూస్ జూలపల్లి:
పెద్దపల్లి జిల్లా,జూలపల్లి మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మందోటా నుండి పోలీస్ స్టేషన్ చౌరస్తా మీదుగా కుర్మపల్లి వరకు వెళ్లే రోడ్డు గత పది సంవత్సరాలుగా పూర్తిగా శిథిలమై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతలు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు అమరగాని ప్రదీప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం జూలపల్లి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, రోడ్డు నిర్మాణం చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా అమరగాని ప్రదీప్ కుమార్, మాట్లాడుతూ… ప్రభుత్వాలు మారినా ఎమ్మెల్యేలు మారినా జూలపల్లి మండల పరిస్థితి ఏమాత్రం మారడం లేదని ఆవేదన చెందారు. గత పది సంవత్సరాలుగా ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినా గత ఎమ్మెల్యే పట్టించుకున్న పాపాన పోలేదని, ప్రస్తుత ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసి రెండు సంవత్సరాలు గడిచిపోయిందని కానీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని వాపోయారు. జూలపల్లి మండలం నుండి అత్యధిక మెజారిటీని ఇచ్చి ప్రస్తుత ఎమ్మెల్యేను గెలిపించుకుంటే కానీ జూలపల్లి సమస్యల పట్ల తనకు చిత్తశుద్ధి లేకుండా పోయిందని విమర్శించారు.. ఇప్పటికైనా మండల కేంద్రంలోని ఈ ప్రధాన రోడ్డుతో పాటు మరియు పెద్దపల్లి టు జూలపల్లి డబుల్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో మండల కేంద్రంలో నిరాహార దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు భూసారపు రవీందర్ గౌడ్, కొమ్మ ఐలయ్య, తీగల అశోక్ గౌడ్, దొడ్ల రాజయ్య, కంచి శ్రీనివాస్, మేరుగు కనకయ్య, పెసరు రాజు, అమరగాని ఎల్లేష్, వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
