అగ్నిధారన్యూస్ కరీంనగర్
-శ్రీధర్ బాబుపై పుట్ట మధూకర్‌కు చేసిన అసత్య ఆరోపణలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశిపాక రాజేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ సీబీఐ విచారణ అనంతరం మీడియా ముందు పలికిన పచ్చి అబద్ధాలు, నిరాధార ఆరోపణలు అత్యంత దుర్మార్గమైన, నిరాధారమై కపట నాటకమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్ కాశిపాక ఖండిస్తూ ఒక పత్రిక ప్రకటనలో మధూకర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పుట్ట మధూకర్ కు న్యాయ వ్యవస్థను రాజకీయం చేస్తూ, తమ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ‘కుట్ర సిద్ధాంతాల’ ముసుగు కప్పుకోవడం సిగ్గు చేటు అని రాజేశ్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మధూకర్ రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం ఉందని చెబుతూనే, ఆ వెంటనే మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుపై ‘కుట్ర’ ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని అన్నారు. ఆయన వాదన అంతా ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉందని ఎద్దేవ చేశారు. నేను
‘బీసీ బిడ్డ’ అంటూనే సామాజిక వర్గం కార్డును వాడుతూ న్యాయ ప్రక్రియ నుంచి తప్పించుకోవాలని చూడటం దిగజారుడుతనానికి అద్దం పడుతున్నట్టు ఉన్నదని అన్నారు. న్యాయం, నేరం కులాన్ని చూసి రావని, చట్టం ముందు కులం కార్డు పనిచేయదని రాజేశ్ హితబోధ చేశారు. నేరానికి, కులానికి ఇక్కడ సంబంధం లేదనీ, పుట్ట మధు వామన్‌రావు దంపతుల హత్య వంటి ఘోర నేరం నుంచి తప్పించుకోవాలని చూడటం రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతమని రాజేశ్ తెలిపారు. నేరస్తులకు చట్టం ముందు అందరూ సమానులే అని పుట్ట మధుకర్ కు తెలియదా? కోర్టుల ప్రక్రియపై నిందలు వేసే అధికారం మాజీ ఎమ్మెల్యేకు లేదు. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఏ సామాజికవర్గమైనా సరే, బాధితుల పక్షాన నిలబడడం ఆయన నైజం. శ్రీధర్ బాబు రాజకీయం చేయడం లేదని, ఆయనది నిస్వార్థ ప్రజా సేవ అని, ఆయన జీవితం మంథని ప్రజల సేవ, అభివృద్ధి ఆయన లక్ష్యం అని రాజేశ్ తెలిపారు. దుద్దిళ్ళది వ్యక్తిగత కక్ష్య కాదని, బాధితుల పక్షాన న్యాయం కోసం నిలబడి, సుప్రీంకోర్టు వరకు పోరాడిన నిష్కళంక, ధైర్యవంతుడైన నాయకుడు అని అన్నారు. ఏళ్ల తరబడి మంథని ప్రజలకు అండగా ఉన్న శ్రీధర్ బాబు నాయకత్వంపై బురద జల్లి, రాజకీయ లబ్ధి పొందాలనే పుట్ట మధుకర్ ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని రాజేశ్ అన్నారు.
మంథని మధూకర్ కేసును హైకోర్టు నుంచి బయటకు తీసుకురాలేకపోతున్నారని శ్రీధర్ బాబుపై నిందలు వేయడం చట్ట ప్రక్రియపై ఆయన అజ్ఞానానికి నిదర్శనం అని తెలుస్తుందని అన్నారు.
‘అక్క కొడుకు తప్పు చేస్తే నన్ను శిక్షించాలా?’ అంటూ పుట్ట మధుకర్ వేసిన ప్రశ్నతోనే, ఈ హత్య కేసుతో మీ కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని మీరు పరోక్షంగా అంగీకరించినట్లు ప్రజలకు అర్థమవుతుందని రాజేశ్ తెలిపారు. చట్టంపై నమ్మకం ఉంటే, దొరికిపోయిన దొంగల మాదిరి మాట్లాడకుండా సీబీఐ విచారణకు పూర్తిగా సహకరించండి. అనవసర కుట్ర ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, అబద్ధపు ప్రచారాలు, రాజకీయ కక్ష్య సిద్ధాంతాలకు మంథని ప్రజలు లొంగరని గ్రహించాలి అన్నారు. మంథని ప్రజలు గత ఎన్నికల్లోనే మీకు గుణపాఠం చెప్పారని ఇప్పుడు చట్టం, వ్యవస్థపై నిందలు వేయడం మానుకోవాలని రాజేశ్ సూచన చేసారు. న్యాయ ప్రక్రియను అడ్డుకోవాలని చూసినా, తప్పుడు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీ ఉక్కుపాదంతో అణిచివేస్తుందని, న్యాయం గెలుస్తుంది, సత్యమే నిలబడుతుందని అన్నారు. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రజల విశ్వాసం, న్యాయం, ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. చట్టం, వ్యవస్థపై మాకు, రాష్ట్ర మంత్రికి శ్రీధర్ బాబుకు పూర్తి గౌరవం ఉందని అన్నారు. ఇప్పటికైనా న్యాయ ప్రక్రియను అడ్డుకోవాలని చూసినా, ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించడం మాకోవానాలని రాజేష్ హెచ్చరించారు. మంథని ప్రజల ఆదరణ శ్రీధర్ బాబు వైపు ఉందనే అక్కసుతో చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు కాంగ్రెస్ పార్టీ లొంగదని మధుకర్ గుర్తించుకొని ఉండాలని రాజేశ్ హితవు పలికారు. లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉక్కుపాదం మోపుతుందని రాజేష్ కాశిపాక పుట్ట మధుకర్ ను తీవ్రంగా హెచ్చరించారు.