అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన మెట్టు నరేష్(42) ఆరోగ్యం బాధతో మానసికంగా కుంగిపోయి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగా లేదని, ఆసుపత్రికి పోయిన ఆరోగ్యం కుదుట పడకపోవటం తో మానసిక వేదనకు గురయ్యాడు.రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రపోయాక బలవన్మరణo చెందాడు. పోస్ట్ మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య మాధవి తో పాటు కూతురు రక్షిత(17), కొడుకు దేవన్ష్(6) వున్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.