అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రానికి మాజీ పీసీసీ అధ్యక్షుడు మాజీ రాజ్యసభ. సభ్యులు. వి. హనుమంతరావు , పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు ,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, సందర్శించారు వరి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతులతో మాట్లాడి వారి సమస్యలును జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ లో వివరించినారు .ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటను మార్కెట్ కు తీసుకు వస్తే మార్కెట్లో ఉండేటటువంటి సిబ్బంది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో రైతులు వరి కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక సందర్భంలో మార్కెట్ సిబ్బందిపై మాజీ ఎమ్మెల్యే విజయ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మినుపాల ప్రకాష్ రావు,కల్వల శ్రీనివాస్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దన్నాయక్ దామోదర్ రావు,పెర్క శ్యామ్ మండల అధ్యక్షుడు చిలుక సతీష్, కల్లెపల్లి జానీ,కవ్వంపల్లి తిరుపతి,ఆర్షణపల్లి వెంకటేశ్వర్ రావు,నరహరి సుధాకర్ రెడ్డి, పుదరి చంద్ర శేఖర్,మరియు అమిరుశెట్టి రాయలింగు,కుమార్ కిషోర్ ,పుప్పాల శంకర్, అమ్ముల రాయముల్లు, మేకల పోచాలు , దన్నాయక్ శ్రీనివాస్,అమిరుశెట్టి తిరుపతి, రావు,పొన్నం అశోక్,తదితరులు పాల్గొన్నారు.
