అగ్నిధార డెస్క్, ఆదిలాబాద్/✍️✍️ ఖమర్
◾నట్టేట ముంచుతున్న మనీ ఎర్నింగ్ యాప్ లు.
◾ డబ్బు ఆశతో”తోయువత పరేషాన్.
◾”ఏబీసీడి” ప్రజల డబ్బు దోచెయ్.
◾జిల్లాలో జోరందుకున్న మనీ ఎర్నింగ్ యాప్ దందా.
◾మాయమాటలు చెప్పి యువకులను నట్టేట ముంచుతున్న మధ్యవర్తులు(రెఫరల్స్).
◾ఇచ్చోడ మండల కేంద్రంగా కోటి రూపాయల దందా.
◾ యాప్ యాజమాన్యాలపై సుమోటో కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితుల ఆవేదన.కరోనా వలన ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయితే కొందరు మాత్రం అక్రమంగా సంపాదించడం కోసం పక్కా ప్లాన్ వేశారు.మనీ ఎర్నింగ్ యాప్స్ పేరిట ప్రజలను యువకులను నట్టేట ముంచుతున్నారు.పెట్టుబడి పెట్టండి రెట్టింపు చేసుకోండి అంటూ ఆశ చూపి ప్రజల డబ్బును కాజేస్తున్నారు.ఈ మనీ ఎర్నింగ్ ఈ యాప్లకు మూలం స్తంభాలుగా మధ్యవర్తులు(రెఫరల్స్) పనిచేస్తున్నారు.తాము లక్షల్లో సంపాదించుకున్నాము మీరు కూడా పెట్టు బడి పెట్టండి మీరు కూడా సంపాదించుకోండి అని ప్రజలను నమ్మబలికి ఈ యాప్ లలో పెట్టుబడులు పెట్టించి వారిని మోసం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కేంద్రంలో ఈ దందా జోరుగా నడుస్తుంది.
◾మధ్యవర్తులదే(రెఫరల్స్)కీలకపాత్ర:
ఈ యాప్ నడవడానికి ముఖ్యంగా మధ్యవర్తులే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.ఎందుకంటే ఈ యాప్ లలో ప్రజల ద్వారా పెట్టుబడిపెట్టు పెట్టిస్తే మధ్యవర్తులకు అధిక లాభం చేకూరుతుంది కాబట్టి.మొదట వీరు తమకు వచ్చిన లింకును వేరే వాళ్లకు రెఫర్ చేసి అందులో పెట్టుబడి పెట్టిస్తారు.ఈ మోసపూరిత బిజినెస్ లో గ్రామీణ ప్రాంత ప్రజలే వీరి టార్గెట్.ఇచ్చోడ మండలంలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తులు ఈ బిజినెస్ ను జిల్లావ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాపింపజేశారు.మీరు రూ 30,000 పెట్టుబడి పెట్టండి ప్రతి రోజు రూ.1,400 సంపాదించండి అని ప్రజలను నమ్మబలుకుతున్నారు. ప్రజలు పెట్టుబడి పెట్టిన మూడు,నాలుగు రోజులు రూ.1400 చొప్పున వారి వ్యాలెట్ లో జమ అవుతున్నాయి.తీరా వారంరోజుల తర్వాత ప్రజలకు పంగనామం పెట్టేస్తున్నారు.◾ప్రజలను మోసం చేసిన వారిపై సుమోటో కేసు నమోదు చేయాలి:
ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసిన వారి పైన అదేవిధంగా ఈ యాప్ యజమానుల పైన సుమోటో కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ యాప్ ద్వారా దాదాపు కోటి రూపాయలు నష్టo జరిగి ఉండవచ్చు అని అంచనా, ఒక మండల కేంద్రంలోనే ఇంత నష్టం వాటిల్లితే జిల్లాస్థాయిలో, దేశం మొత్తం మీద ఎంత దోచేశారో ఆ దేవుడెరుగు.కనీసం ఇప్పుడైనా ప్రజలు,యువకులు ఇలాంటి మోసపూరిత యాప్ లను నమ్మకండి మీ జీవితాలను చిందరవందర చేసుకోకండి అప్రమత్తంగా ఉండాలనిపలువురు కోరుతున్నారు.
