అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామంలో “వడ్ల కల్లాల్లోకి-కాంగ్రెస్ పార్టీ” కార్యక్రమంలో భాగంగా, వరి కొనుగోలు కేంద్రానికి వెళ్లి ధాన్యం కొనుగోళ్లలో జరగుతున్న జాప్యంపై రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న పెద్దపల్లి మాజీ ఎమ్మెల్లే చింతకుంట విజయరమణారావు .ఈ సంధర్భంగా ఆయన మట్లాడుతూ,సబ్బితం గ్రామంలోని ఐకెపి సింగల్ విండో వరి కొనుగోలు కేంద్రానికి రైతులు వరి దాన్యం తీసుకొచ్చి దాదాపు 30 రోజులు గడుస్తున్న కొనుగోలు జరగక అకాల వర్షాలకు రైతులు దిక్కు తోచని స్తితిలో ఉంటె రైతులకు అండగా ఉండాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాసంగి వరి దాన్యం కొనుగోలుపై డ్రామాలాడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రైతులనూ మోసంచేస్తున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక దర్నా చౌక్ అవసరం లేదని తీసేసిన కెసిఆర్ అదే దర్నా చౌక్ లో రైతుల కోసం అంటూ దర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు .సబ్బితం,రాఘవపూర్,రంగాపూర్ గ్రామాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉందని రైతులు పండించిన పంటలను నాశనం చేస్తున్నాయని జిల్లా యంత్రంగం, స్థానిక ఎమ్మెల్లే చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని రాజకీయాల్లో ఎన్నుకుంటే వ్యాపార దోరణిలో ఆలోచిస్తున్నారే తప్ప వరి దాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు సమధానం చెప్పలేకపోవడం దురదృష్టకరం అన్నారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వరి వేస్తె ఉరే అని అనడం, ఆరుతడి అంతర్గత పంటలు వేయండి అని కొత్త డ్రామా ఆడటం ఇవన్ని, చేతకాని పాలనకు నిదర్శనం అన్నారు .కేంద్ర ప్రభుత్వం బియ్యం కోనట్లేదని మేము కూడ వడ్లు కొనబోమని అంతర్గత పంటలు వేసుకోమని చెప్పడం, ఎంతవరకు సమంజసం అన్నారు.కేంద్రంలో ఉన్న బిజెపి మోడీ ప్రభుత్వం నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చెయ్యడం దేశంలోని రైతులందరి విజయమని ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయాలు ఉండాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టి రైతులకు మద్దతుగా పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ది చెప్పి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని విజయరమణారావు అన్నారు .కాంగ్రెస్ పార్టి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు వరి ధాన్యం పండించవద్దని కొనబోమని ప్రకటించిన దాఖలాలు లేవని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావాలని రైతులు ఎంత వరి ధాన్యం పండించినా గింజ కటింగ్ లేకుండా కొనుగోలు చేసే భాద్యత తీసుకుంటామని ఈ సంధర్భంగా విజయరమణారావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భూతగడ్డ సంపత్, తాడూరి శ్రీమాన్, తూముల సుభాష్, కందుల అశోక్,గుమ్మడి ప్రసాద్,నారాయణ, కిష్టయ్య,శ్రావణ్, సమీర్, అనిల్, అభిలాష్ , పవన్, అశోక్ ,అనిల్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
