అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం దేవుని పల్లి గ్రామంలో నిర్వహిస్తున్న టువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆలయ సిబ్బందిని పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శంకర్ కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు . ఆలయ ప్రాంగణం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని E O కి సూచించారు . జాతర సమయంలో పెద్దపల్లి మున్సిపల్ సిబ్బంది సహాయంతో ఆలయ ప్రాంగణంలో చెత్తాచెదారం లేకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలి అన్నారు. శానిటేషన్లో భాగంగా బ్లీచింగ్ చేయాలన్నారు . జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా క్రమపద్ధతిలో పార్కింగ్ ఉండేలా చూడాలన్నారు .పోలీస్ క్యాంప్ టెంట్ వేయించాలన్నారు .జాతరకు వచ్చే ప్రజలకి ఉచిత వైద్య సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తదనంతరం లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు ఆయన వెంట. RI భాను ప్రసాద్ ఆలయ E O శంకర్ MPTC పందిళ్ళ లక్ష్మణ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు స్వామివారిని దర్శించుకున్న వారిలో పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి ఉన్నారు.
