అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
దేవునిపల్లి లక్ష్మీనరసింహా స్వామి వారిని దర్శించుకున్నపెద్దపల్లి జిల్లాకాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య.
బుధవారం రోజున పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతర రథోత్సవంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య శ్రీలక్ష్మీనరసింహాస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అర్చకులు రాము ప్రత్యేక పూజలునిర్వహించారు.. ఈసందర్భంగా, ఆయనమాట్లాడుతూ,శ్రీలక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాలు జిల్లాలోని ప్రజలందరిపై ఉండాలి అని,ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విలసిల్లాలని, ఆ దేవున్ని ప్రార్థిస్తున్ననన్నారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పెద్దపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కడార్ల శ్రీనివాస్,యువజన కాంగ్రెస్ పెద్దపల్లి అసెంబ్లీ అధ్యక్షుడు పూదరిచంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరగొండ రాజ్ కుమార్ లు పాల్గొన్నారు
