క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా ఉపయోగపడుతాయని రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెద్దపెల్లి జిల్లా పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు పెద్దపల్లి జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించారు..ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిలుగా రామగుండం సి.పి.చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ , ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు..
ఈ క్రీడలలో సబ్ డివిషన్ లోని ఏడూ మండలాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు సవత్సరాల నుండి స్టూడెంట్స్, ప్రజలు అందరు కరోన మహమ్మారి కి భయపడి ఇంట్లోనే ఉండిపోయారు..ఇప్పుడుఇప్పుడే బయటికి వస్తున్న నేపథ్యంలో ఇటువంటి క్రీడలు క్రీడాకారులకు మానసిక ఉల్లాసంగా, దేహ దారుఢ్యాన్ని పెంపొందించే విధంగా, చెడు అలవాట్ల వైపు వెళ్లకుండా పనిచేస్తాయనన్నారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి,సబ్ డివిషన్ సి.ఐ లు,ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు..