మహిళల ఇబ్బందులనుదృష్టిలోఉంచుకొని ప్రతిపాదిత  జకోటియాపెట్రోల్ బంక్ వద్దమరుగుదొడ్లనిర్మాణపనులను వెంటనే         ప్రారంభించాలి.MIM కౌన్సిలర్ బొంకూరి       భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ.
            :::::::::::::::::::::::::::::::::::::::                                 .పెద్దపల్లి అగ్నిధార న్యూస్ బుధవారం పెద్దపల్లి మున్సిపల్ సమావేశంలో.MIM పార్టీ 8వ,వార్డు కౌన్సిలర్ బొంకూరి.భాగ్యలక్ష్మి సురేందర్ సన్నీ మాట్లాడుతూ  కమాన్ చౌరస్తాలో ప్రతిపాదిత స్థలం జకోటియాపెట్రోల్ బంక్ వద్ద మరుగుదొడ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని మునిసిపాలిటీ సాధారణ సమావేశములో ప్లేకార్డును ప్రదర్శించి మరుగు దొడ్ల అవసరాన్ని అధికారులు చైర్మన్ ద్రుష్టికితీసుకువెళ్లారు.  స్వచ్ఛభారత్ కార్యక్రమములో భాగంగా, నిత్యం   పెద్ధపల్లి జిల్లాకేంద్రానికి వచ్చే వెళ్లే ప్రజల సౌకర్యార్థం 6చోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి గత రెండు సంవత్సరాల క్రితమే ప్రతిపాదనలనుసిద్ధం చేసినప్పటికీ 5చోట్ల నిర్మాణాలు చేసి నిత్యం రద్దీగా ఉండే కమాన్ చౌరస్తా వద్ద మాత్రం ఇప్పటికి నిర్మాణ పనులను ప్రారంభించక పోవడం వలన  ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎదుకొంటున్న సమస్యల పట్ల అధికారులుకు ప్రజాప్రతినిధులకు ఎలాంటి చిత్తశుద్ధి ఉన్నదో  అర్థమవుతుందన్నారు. ఇదే స్థలంలో మరుగుదొడ్లను నిర్మించేందుకు భవాని సోషల్ వెళ్ఫెర్ సొసైటీ వారికి ఒప్పందం చేసి ఇప్పటివరకు రెండు సంవత్సరాలు గడుస్తున్నా నప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అధికారులు ,ప్రజాప్రతినిధుల తీరు వున్నదని 5చోట్ల మరుగుదొడ్ల నిర్మాణానికి చూపిన ఉత్సాహాన్ని  ప్రతిపాదిత స్థలము అయిన జకోటియా పెట్రోల్ బంకు వద్ద మరుగుదొడ్లను నిర్మించుటలో ఉత్సాహాన్ని చూపక పోవడా వెనుక ఉన్న ఆంతర్యము ఏమిటన్నది అర్థమౌతాలేదని వారున్నారు. వెంటనే ప్రతిపాదిత స్థలంలో మరుగు దొడ్ల నిర్మాణపనులను పూర్తి చేసి ప్రజలు మహిళలు మూత్రశాలలు లేక పడుతున్న ఇబ్బందులను తొలగించాలని లేనిపక్షంలో ఎం.ఐ.ఎం పార్టీ తరుపున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు అన్నారు.