అగ్నిధార ప్రతినిధి

*దేశమంతా సుభిక్షంగా ఉండాలి*
*శ్రీ దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డిసిసి అధ్యక్షులు ఈర్ల.కొమురయ్య*పెద్దపల్లి : మండలంలోని భోజన్న పేట గ్రామంలోని ఛత్రపతి యువసేవ దుర్గా కమిటి ఆద్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గా దేవిశరన్నవరాత్రిఉత్సవాలను పురస్కరించుకుని సకుటుంబ సమేతంగా పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఈర్ల.కొమురయ్యగారు దేశమంతా సుభిక్షంగా ఉండాలని రైతులకు పంటలు సమృద్దిగా పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ మహాదేవి మనందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు

అనంతరం ఛత్రపతి యువసేన సభ్యులు శ్రీ ఈర్ల.కొమురయ్య దంపతులను శాలువాలతో సన్మానించారు