అగ్నిధార: ప్రతినిధి. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలో ఆంధ్రజ్యోతి విలేఖరి ఇంటి పైన జరిగినటువంటి దాడిని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండించారు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చింతకింది చంద్రమౌళి మాట్లాడుతూ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి ఇది ప్రభుత్వ దమనకాండకు నిదర్శనమన్నారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలో చాలామంది జర్నలిస్టులు సోదరులు జర్నలిజం వృత్తి దైవంగా భావించి యదార్థ వార్తలు ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో అనేకమంది జర్నలిస్ట్ మిత్రుల పైన రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయి అన్నారు వరంగల్ జిల్లాలో జరిగినటువంటి సంఘటనను బ్లాక్ డేగా అభివర్ణించారు ఇకముందు జర్నలిస్టుల పైన దాడులు జరిగినట్లయితే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతా మన్నారు ఈ కార్యక్రమంలో రాజశేఖర్ వెంకటేశం రమేష్ షాబీర్ పాషా లక్ష్మణ్ విద్యాసాగర్ అంజి తదితరులు పాల్గొన్నారు.
