ప్రమాదకరంగా ప్రయాణం
బ్రిడ్జి ఎక్కలేక అవస్థలు పడుతున్న ప్రజలు. వాహనదారులు
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అంటున్న వాహనదారులు.
ప్రమాదం జరగకముందే సమస్య పరిష్కరించాలి అంటున్న ప్రజలు.
స్తంభించిన ట్రాఫిక్..
అగ్నిధారన్యూస్ రూరల్: పెద్దపల్లి
పెద్ద కలవల కొలనూర్ రహదారి కొత్తపల్లి శివారులో చిన్న వాగు బ్రిడ్జికి ఇరువైపులా శనివారం ఉదయమే వందలాది వాహనాలు స్తంభించిపోయాయి. శుక్రవారం రాత్రి దాదాపు 9 గంటల ప్రాంతంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి నుండి వరి ధాన్యం నింపుకొని వస్తున్న లారీ బ్రిడ్జి ఎక్కుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారుకు లారీ సైడ్ ఇవ్వడంతో బ్రిడ్జి కాంట్రాక్టర్ పోసిన పోతమట్టితో లారీ ఒక వైపుకు వంగి ప్రమాదపుటంచుల్లోకి వెళ్ళింది. గమనించిన లారీ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేయడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఉదయం దస్తగిరిపల్లి వైపు నుండి కొత్తపల్లికి వస్తున్న ( హార్వెస్టర్ ) వరి కోత మిషన్. లారీ పక్క నుంచి వెళుతున్న క్రమంలో బ్రిడ్జికి పోసిన మట్టిలో దిగబడింది. అటు లారీ ఇటు హార్వెస్టర్ ప్రధాన మార్గాన్ని బ్లాక్ చేశాయి. వాహనాలను కదిలిస్తే కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. ఉదయం సమయం కావడం చేత ఇరువైపులా పెద్దపల్లి కాల్వ శ్రీరాంపూర్ మార్గంలో వెళ్లే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రైతుల వాహనాలతో రెండు గంటల పాటు రోడ్డు మార్గం స్తంభించిపోయింది. జెసిబి సహాయంతో హార్వెస్టర్ పైకి తీశారు.
ప్రమాదకరంగా ప్రయాణం
ఆరు నెలల క్రితం నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. అని ప్రయాణికులు అంటున్నారు. బ్రిడ్జిరువైపులా చాలా ఎత్తులో పోత మట్టి పోయడంతో వాహనాలు అంత ఎత్తు ఎక్కలేకపోతున్నాయని వాహనదారులు అంటున్నారు. ఇరువైపుల పోసిన మట్టి బ్రిడ్జికి ఇరువైపున కొంత దూరం నుండి కాకుండా దగ్గర నుండి పోయడంతో ఈ పరిస్థితి తయారైంది. నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఎడ్జి వరకు కాకుండా ఎక్కువ విస్తీర్ణంలో మట్టి పోసినట్లయితే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇదే మార్గం గుండా ప్రతిరోజు వందలాది టూవీలర్ ఫోర్ వీలర్స్ తో పాటు పాఠశాల బస్సులు కూడా నడుస్తున్నాయి. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్ కానీ, ఉన్నతాధికారులు కానీ స్పందించి ప్రమాదకరం కానీ ప్రయాణానికి మార్గం చూపాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.




