తల్లిదండ్రులు కావాలనుకునే వారి తాటతీస్తున్న ఆసుపత్రులు.
అమాయకుల ఆసరాను క్యాష్ చేసుకుంటున్న కేటుగాళ్లు.
దృష్టి సారించని వైద్యశాఖ అధికారులు.
అగ్నిధారన్యూస్ క్రైమ్ విభాగం
పెళ్లయి పిల్లలు కాక మానసికంగా ఇబ్బంది పడుతున్న దంపతులను టార్గెట్ గా చేసుకుని తల్లిదండ్రులు కావాలనుకునే టార్గెట్ చేసుకొని (ప్రచారం మాధ్యమాలలో పెద్దపెద్ద ప్రకటనలు, సోషల్ మీడియా, ఫేస్బుక్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లలో) వారిని ఆశల పల్లకిలోకి దించి అర్హత లేని సంతాన సాఫల్య కేంద్రాలు కొన్ని ఘరానా మోసాలకు తెరలేపుతున్నారు. కొంతమందికేటుగాళ్లు ఫెర్టిలిటీ కేంద్రాల పేరుతో ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో పుట్టగొడుగులుగా కేంద్రాలను ఏర్పాటు చేసి అచ్చిరాని వైద్యం చేస్తూ దేవుడి మీద భారం వేస్తూ ఆసుపత్రిలో నడుపుతున్నట్లు పక్కా సమాచారం. ఫెర్టిలిటీ హాస్పిటల్స్ కు ఉండవలసిన నిబంధనలను వైద్యశాఖ అధికారుల అండదండలతో తుంగలో తొక్కి కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. సంతానం కావాలి అనుకునే వారి ఆశలను మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.మొదట కొద్ది రోజులు మందులు ఇస్తారు. ఆ మందులతో సెట్ కావడం లేదంటూ. ఐ వి ఎఫ్ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్( IVF ) in vitro fertilization. కృత్రిమ గర్భాధారణ పద్ధతి విధానంలో సంతానం పొందవచ్చని నచ్చజెప్పుతారు.ఇది బాగానే ఉంది కానీ… రక్తం పేల్చినట్టు లక్షలకు లక్షలు వైద్యం పేరుతో లాగుతారు. .. ఐ వి ఎఫ్ చేసే అర్హతే లేని హాస్పటల్లో ఐవీఎఫ్ పద్ధతిలో వైద్యం ఎలా..? చేస్తారు. అనేది ఇక్కడ పెద్ద మిస్టరీ. ఇదే విషయమై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక హాస్పటల్లో జరుగుతున్న తంతుపైన ఆర్ టి ఐ.. సమాచార హక్కు చట్టంలో అడిగిన సమాచారంతో విస్తుపోయి నిజాలు బయటికి వచ్చాయి. హైదరాబాదులో “సృష్టి” హాస్పటల్ లో సరోగసి పేరుతో జరిగిన ఘరానా మోసం యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇక్కడ “మరో సృష్టి”నీ తలపించే విధంగా బాగోతం నడుస్తుంది. ఆ హాస్పిటల్లో కృత్రిమ గర్భధారణ ఐ వి ఎఫ్ పైన శిక్షణ పొందిన డాక్టర్లు ఉన్నారా అంటే… లేరని చెప్పాలి. అధికారులు ఏం చేస్తున్నారు అంటే చూసి చూడనట్టు ఉంటున్నారు. పూర్తి వివరాలు త్వరలో
