హాస్పిటల్ లో చేర్పించిన గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్
అగ్నిధార గోదావరిఖని టౌన్ నవంబర్:08
గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగరేణి మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న చెట్ల పొదలలో శుక్రవారం రాత్రి ఒకరు శరీరానికి మంట అంటించుకొని అరుస్తూన్నారు, అని మెడికల్ కాలేజీ విద్యార్థులు గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి కి సమాచారం అందించగా వెంటనే ఇన్స్పెక్టర్ స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా అక్కడ ఒక మహిళ సగం కాలిన శరీరంతో ప్రాణాపాయ స్థితిలో అక్కడ పడి ఉండగా పోలీస్ సిబ్బంది, మెడికల్ కళాశాల విద్యార్థుల సహాయంతో స్వయంగా మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. ఘటన కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

