సోమలింగేశ్వర ఆలయంలో దీపోత్సవం

          అగ్నిధారన్యూస్ పెద్దపల్లి 

పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలోనీ అతి పురాతనమైన సోమలింగేశ్వర ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి పర్వదినాన గ్రామ ప్రజలు ఉదయం నుండి సాయంత్రం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. సాయంత్రం శివుడికి గంగా దేవికి గణపతి నంది తులసి దేవుళ్ళకి, భక్తులు దీపారాధన చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కార్తీక పౌర్ణమి ఉత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ సర్పంచ్ సిరాలపు సత్యం, స్థానిక శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు సహకారంతో నాలుగు రోజుల క్రితం ఆలయ ఆవరణ వరకు సిసి రోడ్డు వేయించారు. సోమలింగేశ్వర ఆలయ ప్రాంగణం అంతా దీపాలతో చూడముచ్చటగా అలంకరించారు. అదేవిధంగా గ్రామంలోని హనుమాన్ ఆలయంలో భక్తులు పూజలు చేశారు. ఆ పక్కనే ఉన్న చెన్నకేశ్వరాలయంలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రోజంతా ఆధ్యాత్మిక వాతావరణంలో గ్రామ ప్రజలు మునిగి తేలారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.