రెండు బైకులు ఢీకొని నలుగురికి గాయాలు.
తీవ్ర గాయాల పాలైన వారిని 108 లో హాస్పటల్లకు తరలింపు.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్.. సోమవారం సాయంత్రం దాదాపు8 గంటల ప్రాంతంలో పెద్దపల్లి మండలం రాంపల్లి హనుమంతుపేట గ్రామాల మధ్య రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొట్టగా నలుగురు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన రాజు, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓకే బైకు పై పెద్దపల్లి వైపు వస్తున్న క్రమంలో పెద్దపల్లి నుంచి కాల్వ శ్రీరాంపూర్ వైపు వెళుతున్న మరో బైక్ వేగంగా ఢీ కొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి పాక్షిక గాయాలైనట్టు సమాచారం. గాయపడ్డ వారిని 108 లో పెద్దపల్లి హాస్పిటల్ కి తరలించి, అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కరీంనగర్ హాస్పిటల్ కి తరలించినట్లు తెలిసింది. గాయపడ్డ వారిలో ఇద్దరు కాల్వ శ్రీరాంపూర్ మండలం చెందిన వారిగా, మరో ఇద్దరు విజయవాడకు చెందిన వారిగా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

