దర్జాగా ఇసుక దందా.

ధనార్జీనే ధ్యేయంగా అక్రమార్కుల ఆగడాలు.

వాహనాలను సీజ్ చేసిన మైనింగ్ అధికారి శ్రీనివాస్.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి//సుల్తానాబాద్ క్రైమ్

.. అధికారుల కళ్లగప్పి మానేరు నది పరివాహ గ్రామాలు నీరుకుల్లా గట్టపెల్లి నుండి ఇష్టానుసారంగా అక్రమ ఇసుకను సుల్తానాబాద్ పట్టణానికి చుట్టుపక్కల గ్రామాలలో పొద్దంతా ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ చేసి రాత్రి కాగానే తరలింపు దందాకు తెర లేపుతారు.పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపురం గ్రామంలో అర్ధరాత్రిలో నెలల తరబడి జరుగుతున్న అక్రమ ఇసుక దందాను మైనింగ్ శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ పాగా వేసి పట్టుకున్నారు. ఇసుకను లారీలను సీజ్ చేశారు. నారాయణపూర్ గ్రామంలోని ఓ పాత రైస్ మిల్లులో పొద్దంతా ట్రాక్టర్ల ద్వారా సుల్తానాబాద్ పట్టణానికి సమీపంలోని మానేరు వాగు నుండి వందలాది ట్రాక్టర్ల అక్రమ ఇసుకను ఇక్కడ డంపు చేసి చీకటి పడగానే,ఇసుక అక్రమ రవాణాకు తెరలేపి కరీంనగర్ హైదరాబాద్ ప్రాంతాలకు లారీల ద్వారా డంపు చేసిన ఇసుకను దర్జాగా అమ్ముకుంటూ. లక్షల సంపాదిస్తున్నారు. గత కొద్దిరోజులుగా నిఘా పెట్టిన మైనింగ్ అధికారులు బుధవారం అర్ధరాత్రి పక్క సమాచారంతో మైనింగ్ శాఖ అధికారి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగారు. అది చూసిన అక్రమార్కులు ఒక లారీని జెసిబి ని అక్కడి నుంచి తప్పించినట్లు తెలిసింది. మైనింగ్ అధికారి ఘటన స్థలానికి చేరుకొని మూడు వాహనాలను సీజ్ చేసి పెద్దపల్లి ఆర్టీవో ఆఫీస్ కి తరలించారు… ఇందులో మైనింగ్ అధికారులు ఎస్ ఆర్ ఓ ప్రశాంత్, సతీష్, సహాయకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.