నవంబర్ 17 నుండి సీసీఐ మార్కెట్ యార్డు కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దు…
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, నవంబర్-15:–
నవంబర్ 17 నుంచి జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ ప్రైవేట్ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి శనివారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ విజ్ఞప్తి చేశారు.
భారత పత్తి సంస్థ పత్తి జిన్నింగ్ మిల్లుల విషయంలో విధించిన నిబంధనలు సడలించే వరకు నవంబర్ 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ కొనుగోలు, ప్రైవేటు కొనుగోలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తెలిపారు అన్నారు.
ఈ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు రైతులు మార్కెట్ కు గాని లేదా జిన్నింగ్ మిల్ వద్దకు పత్తి తీసుకొని రావద్దని తెలిపారు. సీసీఐ కు పత్తి అమ్ముకునే రైతులు తమ యొక్క స్లాట్ బుకింగ్ అయినాకూడా పత్తి తీసుకు రావద్దని తెలిపారు. పత్తి కొనుగోళ్ల విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రైతులు పత్తిని అమ్మకానికి తీసుకొని రావద్దని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
