అక్రమంగా నిలువ చేసిన ఇసుక డంపులు
అధిక ధరకు లారీల్లో ఇసుక తరలిస్తున్న వైనం
పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్// సుల్తానాబాద్ రూరల్
రోజురోజుకు ఇసుక మాఫియా ఆగడాలు మరింత ఎక్కువయ్యాయి. నిన్నటికి నిన్న పాత రైస్ మిల్లులో మైనింగ్ అధికారులు సోదాలు నిర్వహించీ ఇసుక డంపులతో పాటు ఇసుక తరలిస్తున్న వాహనాలను కూడా సీజ్ చేయడంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సుల్తానాబాద్ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో సుగ్లాంపల్లి లోని హరియాలి ఎదురుగా ఉన్న ఓపెన్ ప్లాట్లు తుమ్మ చెట్ల మధ్యలో సుమారుగా 50 నుంచి 60 ట్రాక్టర్ల ఇసుక డంపింగ్ నిలువ చేశారు. ఇసుకని పక్క దారి పట్టిస్తూ హైదరాబాదు లాంటి మహా నగరాలకు అధిక రేటుతో విక్రయిస్తున్నారని, ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లకు ఇసుక అధిక రేటుకు విక్రయిస్తున్నారని ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా నిఘా పెంచి ఇసుక మాఫియాను అరికట్టాలి.
